Site icon NTV Telugu

Jyoti Malhotra: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తెతో జ్యోతి మల్హోత్రా చెట్టాపట్టాల్!

Jyotimalhotra1

Jyotimalhotra1

హర్యానా యూట్యూబర్, పాక్ గూఢచారి జ్యోతి మల్హాత్రా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యూట్యూబ్ ముసుగులో ఆమె చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతిని న్యాయస్థానం ఐదురోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌తో జ్యోతి మల్హాత్రా చాలా క్లోజ్‌గా మూవ్ అయింది. చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడినట్లుగా మాట్లాడుకున్నారు. గురుద్వారాలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో జ్యోతి పాక్ ఏజెంట్‌గా వ్యవహరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Congress vs BJP: రైల్వే టికెట్లపై ఆపరేషన్‌ సింధూర్‌ ప్రచారం.. బీజేపీపై కాంగ్రెస్ ఆగ్రహం..

గురుద్వారాలో జనసందోహం ఉంటే.. అంత జనాభాలో కూడా మరియంతో జ్యోతి ఫ్రీగా మాట్లాడింది. ఆమె కూడా అంతే నెమ్మదిగా సమాధానం ఇచ్చింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారితో ఉన్న పరిచయంతో జ్యోతి పాక్‌లో గూఢచర్యం చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటికే పాక్ హైకమిషన్‌ను భారత్ పంపేసింది. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్ర దాడి సమయంలో జ్యోతి కూడా అక్కడే ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

జ్యోతి మల్హాత్రా(33) హర్యానాలోని హిసార్ వాసి. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన ఆరుగురు వ్యక్తుల్లో జ్యోతి ఒకరు. శనివారం ఆమెను అరెస్ట్ చేశారు. ‘‘ట్రావెల్ విత్ జో’’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు లక్షలకు పైగా సబ్‌స్కైబర్లు, 132 వేల మంది అనుచరులు ఉన్నారు. ఈ ఏడాదిలో పలుమార్లు పాకిస్థాన్ వెళ్లివచ్చింది. పాక్‌కు సంబంధించిన వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. 2023లో న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో సభ్యుడైన ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డినిష్ అనే వ్యక్తిని జ్యోతి కలిసింది. డానిష్ ఆమెకు హ్యాండ్లర్‌గా మారాడు. అనంతరం పాక్ నిఘా వర్గాలను జ్యోతికి పరిచయం చేశాడు. అనంతరం ఎన్‌క్రిప్టెడ్ ఫ్లాట్‌ఫారమ్ ద్వారా ఇద్దరూ కూడా సంబంధాలు కొనసాగించినట్లుగా తెలుస్తోంది. ఇక 2023లో జ్యోతి రెండు సార్లు పాకిస్థాన్‌కు వెళ్లినట్లుగా గుర్తించారు. అక్కడ అలీ ఎహ్వాన్, షకీర్, రాణా షాబాజ్ అనే వ్యక్తులను కలిసింది. పాక్‌ తర్వాత ఎక్కువగా కాశ్మీర్‌లో పర్యటించినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు లోతుగా సాగుతోంది.

Exit mobile version