NTV Telugu Site icon

Kamal Haasan: కాంగ్రెస్ విజయం, రాహుల్ గాంధీ గురించి కమల్ హాసన్ ఏమన్నారంటే..?

Kamal Hassan

Kamal Hassan

Kamal Haasan: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం నమోదు చేసింది. 224 స్థానాల్లో 136 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ 65, జేడీఎస్ 20 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ విజయంపై బీజేపేతర ప్రతిపక్షాలు రాహుల్ గాంధీకి, సోనియాగాంధీకి, ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తమిళ స్టార్ కమల్ హాసన్ కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై స్పందించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: MLA Seethakka : కర్ణాటక ఫలితాలతో మాకు బాధ్యత కూడా పెరిగింది

‘‘రాహుల్ గాంధీ జీ, ఈ విజయాన్నికి హృదయపూర్వక అభినందనలు, గాంధీలాగే మీరు కూడా ప్రజల హృదయాల్లోకి వెళ్లారు. మీ సౌమ్యమార్గం ప్రజల్ని కదిలించగలదని నిరూపించారు. ప్రేమ, మానవత్వంతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. మీ విశ్వసనీయత, ధైర్యసాహసాలు, శ్రేయోదాయమైన విధానం ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించింది. మిమ్మల్ని విశ్వసించి విభజన రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. కేవలం విజయానికే కాదు, విజయం సాధించిన తీరుకు కూడా వందనాలు’’ అని ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు.

అంతకుముందు కాంగ్రెస్ విజయంపై మాట్లాడిన రాహుల్ గాంధీ… ద్వేష రాజకీయాలను కన్నడ ప్రజలు తిప్పికొట్టారని, ప్రేమతో విజయం సాధించామని అన్నారు. కర్ణాటక పేదల తరుపున పోరాడామని, వారు క్రోనీ క్యాపిటలిస్టులను ఓడించారని, మేము ఈ పోరాటాన్ని ద్వేషంతో చేయలేదు, ప్రేమతో పోరాడామని ఆయన అన్నారు. అపూర్వ విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోడీని తిరస్కరించారని, 2024 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పీఎం అవుతారని జోస్యం చెప్పారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు వ్యతిరేకంగా వచ్చిన ఆదేశం అని, ప్రధాని 20 సార్లు కర్ణాటకకు వచ్చారని, గతంలో ఏ ప్రధాని కూడా ఇలా ప్రచారం చేయలేదని సిద్ధరామయ్య అన్నారు.