NTV Telugu Site icon

Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Yogi

Yogi

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో బుధవారం ఆగ్రా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన యోగి, తర్వాత వేరే విమానంలో లక్నో చేరుకున్నారు.

Read Also: Ravishankar : ఆ సీన్ లో రామ్ చరణ్ ను చూస్తే మైండ్ పోతుందిః నిర్మాత రవిశంకర్

విమానం ఆగ్రా నుంచి లక్నోకి బయలుదేరిన తర్వాత పైలట్ బ్రేక్‌లలో సమస్యను కనుగొన్నాడు. టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత, మధ్యాహ్నం 3:40 గంటలకు ఈ సంఘటన జరిగింది. విమానం గాల్లో ఉన్నప్పుడు సాంకేతిక సమస్య ఏర్పడింది. వెంటనే పైలట్లు సమస్యను గ్రహించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీని తర్వాత ఆగ్రా ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చారు. యోగి సురక్షితంగా ఉన్నారని, అధికారులు అతడిని వేరే విమానంలో లక్నోకి తీసుకెళ్లారు. యూపీలో బీజేపీ అధికారం చేపట్టి 8 ఏళ్లు పూర్తయిన రెండు రోజులకే ఈ ఘటన జరిగింది.