NTV Telugu Site icon

Gyanvapi Mosque: “జ్ఞానవాపి మసీదు నిజానికి శివాలయమే”.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..

Gyanvapi Mosque

Gyanvapi Mosque

Gyanvapi Mosque: వారణాసిలో ‘‘జ్ఞానవాపి’’ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంపై ఇటు హిందూ సంఘాలు, అటు మసీద్ కమిటీ మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ జ్ఞానవాపి మసీదు కాదని, అది శివాలయమే అని అన్నారు. శనివారం వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలువడంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, అది ‘శివుని దేవాలయం’ అని చెప్పారు.

యూపీ గోరఖ్ పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ‘‘దురదృష్టవశాత్తు, ప్రజలు జ్ఞాన్‌వాపిని మసీదుగా పిలుస్తారని, కానీ వాస్తవానికి అది ‘విశ్వనాథ్’ (శివుడు) ఆలయం’’ అని అన్నారు. ఈ వివాదాస్పద స్థలం నిజమైన గుర్తింపు లేదా పేరు ఈ సైట్‌లో పూజలు, ప్రార్థనలు చేసే మార్గానికి మాత్రమే కాకుండా, జాతీయ ఐక్యత, సమగ్రతకు కూడా పెద్ద అడ్డంకిగా ఉన్నదని విచారం వ్యక్తం చేశారు. గతంలో మన సమాజం ఎప్పుడూనా ఈ అడ్డంకిని అర్థం చేసుకుని గుర్తించనట్లయితే, మన దేశంలో ఎన్నటికి వలసరాజ్యం ఉండేది కాదు అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Read Also: PM Modi: “హిందువుల గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడి”.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోడీ..

హిందూ సమాజం జ్ఞాన్‌వాపిని మసీదు కాదని, అది శివాలయమని భావిస్తున్నారు. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు జరిగిన వీడియో సర్వేలో కూడా మసీదు అని చెప్పబడుతున్న ప్రాంతంలో హిందూ దేవీదేవతల విగ్రహాలు కనిపించాయి. మసీదులోని వాజూఖానాలోని ఓ కొలనులో శివలింగం వంటి ఆకారం వెలుగులోకి వచ్చింది. అయితే, దీనిని ఫౌంటైన్ అని మసీదు కమిటీ చెబుతోంది. చరిత్ర ప్రకారం చూస్తే 17వ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబే ఆదేశాల మేరకు కూల్చివేశారని చెప్పబడుతోంది.

ఫిబ్రవరిలో, వారణాసి కోర్టు జ్ఞాన్వాపి మసీదు సీలు చేసిన నేలమాళిగలో హిందూ భక్తులను పూజించడానికి అనుమతించింది. కోర్టు ఆదేశం ప్రకారం, వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులోని నిషేధిత ప్రాంతమైన ‘వ్యాస్ కా టెఖానా’లో హిందూ భక్తులను ప్రార్థనలు చేయడానికి అనుమతించారు. ఈ వారం ప్రారంభంలో, హిందూ పక్షం వారణాసిలోని కోర్టును ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సర్వే కోసం ప్రాంగణంలో త్రవ్వడానికి అనుమతించాలని అభ్యర్థించింది. దీనిపై సెప్టెంబర్ 18న కోర్టు నిర్ణయం వెలువడుతుంది.

Show comments