Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Yogi Adityanath Hands Over 76 Flats Built On Murdered Gangsters Seized Land

CM Yogi Adityanath: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ భూమిని పేదలకు పంచిన సీఎం యోగి ఆదిత్యనాథ్..

Published Date :June 30, 2023 , 2:57 pm
By Venu Goapl Reddy
CM Yogi Adityanath: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ భూమిని పేదలకు పంచిన సీఎం యోగి ఆదిత్యనాథ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Yogi Adityanath: కాల్చిచంపబడిన గ్యాంగ్ స్టర్-రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేదలకు పంచారు. ఈ భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్‌ల తాళాలను లబ్ధిదారులకు అందించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద ఈ ఫ్లాట్లను నిర్మించారు, ఈ నెల ప్రారంభంలో లాటరీ ద్వారా కేటాయించారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ఫ్లాట్లను పరిశీలించి లబ్ధిదారులు, అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలను అందించారు.

Read Also: UtterPradesh: పది రూపాయల గొడవ .. దుకాణదారుడిపై దుండగుల కాల్పులు…

ఒక్కో ఫ్లాట్‌లో 41 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు గదులు, వంటగది, మరుగుదొడ్డి ఉన్నాయి. ఫ్లాట్‌ల కోసం 6,000 మందికి పైగా ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లాటరీ పద్ధతిలో 1,590 మందిని అర్హులుగా గుర్తించారు. 2017కి ముందు ఏ మాఫియా అయినా పేదలు, వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల భూమిని లాక్కునే రాష్ట్రంగా యూపీ ఉండేదని.. అప్పుడు పేదలు నిస్సాహయంగా చూడారు.. ఇప్పుడు మనం ఇదే భూమిలో పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని.. ఈ మాఫియా భూమిని తీసుకుని పెద్ద విజయం సాధించామని ముఖ్యమంత్రి అన్నారు.

ఉమేష్ పాల్ హత్య, కిడ్నాప్ కేసులతో పాటు 100 క్రిమినల్ కేసుల్లో దోషిగా ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రయాగ్ రాజ్ లో కాల్చిచంపారు. వైద్యపరీక్షల నిమిత్తం వీరిద్దర్ని ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మీడియా చుట్టుముట్టిన సమయంలో, మీడియా ముసుగులో వచ్చిన దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు అతిక్ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Atiq Ahmed
  • Atiq Ahmed murder
  • bjp
  • CM Yogi Adityanath
  • Uttar Pradesh

తాజావార్తలు

  • MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

  • Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!

  • Death penalty: అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య.. భర్తకు ఉరిశిక్ష..

  • Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..

  • Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions