Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..

  • అయోధ్య నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని అఖిలేశ్ యాదవ్‌కు యోగి సవాల్
  • “మీరు నామినేషన్ వేయండి.. నేను కూడా వేస్తా” అంటూ వ్యాఖ్య
  • అయోధ్యను రాజకీయ వేదికగా కాకుండా విశ్వాసం, అభివృద్ధికి ప్రతీకగా అభివర్ణించిన యోగి
Up Politics

Up Politics

Yogi Adityanath: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సవాల్ విసిరారు. అయోధ్య నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని, తాను కూడా పోటీ చేస్తానని, మన అదృష్టాన్ని ఒకసారి పరీక్షించుకుందామని వ్యాఖ్యానించారు. శనివారం యూపీలోని బలరాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య నుంచి బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని, సీఎం యోగి అయోధ్య నుంచి పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ విసిరిన సవాల్‌కు యోగి కూడా కౌంటర్ ఇచ్చారు.

అయోధ్యకు తాను రాజకీయాల కోసం కాకుండా అభివృద్ధి కోసమే వెళ్తున్నానని, యూపీ అభివృద్ధే తమ ధ్యేయమని యోగి అన్నారు. అయోధ్యను రాజకీయ పోరాట వేదికగా చూడొద్దని, ఇది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన పవిత్ర స్థలమని చెప్పారు. రాష్ట్రంలో గతం మాఫియాలు భూకబ్జాలకు పాల్పడేవని, ఎస్పీ నేతల బెదిరింపులు ఎదుర్కొన్న వ్యాపారులు తమ ఆస్తుల్ని వదులుకోవాల్సి వచ్చేదని ఆయన ఆరోపించారు.

రామమందిరం, కాశీ విశ్వనాథ ధాయ్ నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పడుు ప్రధాని మోడీని వ్యతిరేకిస్తున్నారని యోగి ఆరోపించారు. కాంగ్రెస్ హయాంతో అనేక కుంభకోణాలు జరిగాయని, ఎస్పీ పాలనతో అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు. ఈ ఆరోపణపై రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలిస్తే తమ నాయకత్వమే కారణమని చెప్పే విపక్షాలు, ఓడిపోతే మాత్రం ఈవీఎంను నిందిస్తాయని యోగి చురకలు వేశారు. ఇది ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.