Site icon NTV Telugu

Yogi Adityanath: అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్..

Yogi

Yogi

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృ‌ష్టించారు. యూపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు ఈ పదవిలో ఉన్నారు, కొనసాగుతున్నారు. అంతకు ముందు ఉన్న గోవింద్ వల్లభ్ పంత్ రికార్డును యోగి అధిగమించారు. పంత్ యూపీకి ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల 127 రోజులను యోగి అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు.

Read Also: Ind vs Eng, 4th Test: డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్.. సుందర్-జడేజా చారిత్రాత్మక ఇన్నింగ్స్

యోగి ఆదిత్యనాథ్ మొదట మార్చి 19, 2017న ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌లో వరసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రికార్డు కూడా యోగి, బీజేపీ పార్టీకి ఉంది. తన పాలనలో మాఫియా డాన్‌లు, నేరస్తులను అణిచివేయడంతో యోగి మార్క్ కనిపించింది.

Exit mobile version