Site icon NTV Telugu

Uddhav Thackeray: అవును మేము గుండాలమే, మా “గుండాయిజం” చూస్తూనే ఉంటారు..

Uddhav Thackeray

Uddhav Thackeray

Uddhav Thackeray: శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శనివారం తన విడిపోయిన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ఠాక్రేతో 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా వేదిక పంచుకున్నారు. ఉప్పునిప్పులా ఉండే వీరిద్దరు తమ విభేదాలను పక్కన పెట్టి కలిశారు. ‘‘మేము కలిసి వచ్చాము, కలిసి ఉంటాము’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ ఇద్దరు బంధువులు చివరిసారిగా 2005లో ఎన్నికల ప్రచారంలో వేదిక పంచుకున్నారు. ఆ తర్వాత రాజ్ ఠాక్రే అదే ఏడాది శివసేన నుంచి విడిపోయి 2006లో ఎంఎన్ఎస్ స్థాపించారు.

Read Also: Bhumana Karunakar Reddy: జగన్‌ను చూస్తేనే కూటమి నేతలకు భయం.. అందుకే అడ్డుకునే ప్రయత్నం..!

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పాఠశాలల్లో 1వ తరగతి నుంచి హిందీని మూడో భాషగా ప్రవేశపెట్టే ఉత్తర్వులను రద్దు చేసిన తర్వాత ‘‘అవాజ్ మారాఠీచా’’ విజయోత్సవ సభలో ప్రసంగించారు. ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజలపై హిందీని విధించబోనివ్వమని అన్నారు. ఈ విషయం స్పష్టంగా ఉందని, మా మధ్య దూరాన్ని తగ్గించించిదని రాజ్ ఠాక్రే అన్నారు. ఈ కార్యక్రమం ప్రకటించినప్పటి నుంచి అంతా తమ ప్రసంగాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.

మరాఠీ పేరుతో ‘‘గుండాయిజం’’ చేస్తే సహించబోమని ఎంఎన్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. వారికి న్యాయం జరగకుంటే మా గుండాయిజాన్ని చూస్తూనే ఉంటారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘‘భాష కోసం గుండాయిజం సహించమని ఫడ్నవీస్ అన్నారు. ఒక మరాఠీ వ్యక్తికి న్యాయం జరగకుంటే, మీరు మమ్మల్ని గుండాలు అని పిలిస్తే, మేము గుండాలమే’’ అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని అధికారం నుంచి పడగొడతామని అన్నారు. అధికారం వస్తుంది, పోతుంది కానీ ఐక్యతే బలం అని చెప్పారు.

Exit mobile version