Delhi: ఢిల్లీకి “ఎల్లో అలర్ట్”.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, ఈదురు గాలులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ రాజధాని ఢిల్లీ తడిసిముద్దవుతోంది. మంగళవారం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుతలో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఢిల్లీకి రావాల్సిన అనేక విమానాలను దారి మళ్లించారు. మంగళవారం ఢిల్లీకి రావాల్సిన 10 విమానాల్లో 9 విమానాలను జైపూర్ కు, ఒకదాన్ని లక్నోకు దారి మళ్లించారు.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షం కారణంగా ట్రాఫిక్ అంతరాయం మరియు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని హెచ్చరించింది. బుధవారం ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్ 5 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
మరోవైపు మంగళవారం ఐటీ రాజధాని బెంగళూర్లో కూడా భారీ వర్షాలు నమోదు అయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు చేరింది. జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిస్తే పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి, డ్రైనేజ్ సమస్యలు ఏర్పడే అవకాశ ఉందని వీటిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. గత వారం రోజులుగా రాజస్థాన్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణం 10 మందికి పైగా ప్రజలు మరణించారు. పవర్ గ్రిడ్స్ కు తీవ్ర నష్టం ఏర్పడింది.
తాజావార్తలు
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!