Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
- తిహార్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్ సంచలన నిర్ణయం.
- భార్య ముషాల్ మాలిక్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించిన యాసిన్.
- ‘‘నన్ను ఉరితీయకముందే నిన్ను నిఖా బంధం నుంచి విముక్తి చేస్తా’’ అని అఫిడవిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yasin Malik: జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాది యాసిన్ మాలిక్ తన భార్య ముషాల్ మాలిక్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని తీహార్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మాలిక్, శ్రీనగర్‌లోని టాడా/పోటా కోర్టులో 25 పేజీల అఫిడవితట్ దాఖలు చేశాడు. ఈ అఫిడవిట్లో తన భార్య నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.‘‘ముషాల్ తన మిగిలిన జీవితాన్ని ఈ పరిస్థితుల్లో భారంగా గడపడం, వితంతువుగా గడపడం నాకు ఇష్టం లేదు. ఆమె గౌరవంగా, ఆశతో తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నాడు.
‘‘నన్ను ఉరితీయక ముందే, నిన్ను వివాహ బంధం నుంచి విడిపించేలా నేను నిర్ణయించుకున్నాను’’ అంటూ తన అఫిడవిట్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా తనను తాను నెల్సన్ మండేలాతో పోల్చుకున్నాడు. యాసిన్ మాలిక్ ప్రధానంగా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో తిహార్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై అనేక పాత కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 1990లో కాశ్మీరీ పండిట్ నర్సు సరళా భట్ హత్య, అదే సంవత్సరం వైమానిక దళ సిబ్బంది హత్య వంటివి ఉన్నాయి. సర్లా భట్ హత్యలో తనను తప్పుగా ఇరికిస్తున్నారని, ఈ హత్యలో తన ప్రమేయం లేదని యాసిన్ మాలిక్ ఖండిస్తున్నారు.
Also Read
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
- UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ముషాల్-యాసిన్ మాలిక్ ఎలా కలిశారు..
2005లో పాకిస్తాన్ లో యాసిన్ మాలిక్, ముషాల్ తొలిసారిగా కలుసుకున్నారు. ఉగ్రవాది యాసిన్ మాలిక్ కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ వెళ్లిన సమయంలో ఈ పరిచయం ఏర్పడింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాలిక్ ఫైజ్ కవిత్వాన్ని చదివాడు. ముషాల్ తన తల్లితో ఈ కార్యక్రమానికి హాజరైంది. దీని తర్వాత ఆమె మాలిక్ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకుంది. దీని తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి 2009లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉంది.
తాజావార్తలు
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
Mukesh Ambani: వాటర్, కోలా తర్వాత ఐస్‌క్రీమ్.. రూ.10తో ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి అంబానీ ఎంట్రీ
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!