Yasin Malik Hunger Strike: ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిషేధిత జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ తీహార్ జైలులో శుక్రవారం(జులై 22) నుంచి నిరాహార దీక్ష ప్రారంభించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఆయన కేసును సరైన రీతిలో విచారించడం లేదని ఆరోపిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు.
తీహార్ జైలు నంబర్ 7లో ఉన్న మాలిక్ జూలై 22(శుక్రవారం) ఉదయం నుంచి తన నిరాహార దీక్ష ప్రారంభించాడు. వెంటనే తన నిరసనను విరమించుకోవాలని జైలు అధికారులు సూచించగా.. ఆయన దానికి నిరాకరించాడు. మన దేశ న్యాయస్థానావ్వో న్యాయం దక్కడం లేదని ఆరోపిస్తూ.. తన కేసులపై విచారణ తీరు మారేవరకు లేదా మరణించే వరకు దీక్ష చేస్తానని చెప్పినట్లు మాలిక్ కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. 2019లో జేకేఎల్‌ఎఫ్ నిషేధించబడిన కొద్దికాలానికే యాసిన్ మాలిక్ అరెస్టయ్యాడు. ఈ ఏడాది మే 19న తీవ్రవాద నిధుల కేసుల్లో ఎన్‌ఐఏ కోర్టు దోషిగా నిర్ధారించింది. మే 25న జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదుతో పాటు 10 లక్షల జరిమానా కూడా విధించింది.
Heavy Rain in Warangal: తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే ఘోరం..!
ఈ ఏడాది జులై 15న, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సోదరి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయా సయీద్, డిసెంబర్ 8, 1989న జేకేఎల్‌ఎఫ్ తీవ్రవాదులు ఆమెను కిడ్నాప్ చేసిన కేసులో మాలిక్‌ను గుర్తించారు.డిసెంబరు 8, 1989న శ్రీనగర్‌లో రుబయ్యా అపహరణకు గురయ్యారు. ఐదు రోజుల తర్వాత డిసెంబరు 13న ఐదు రోజుల తర్వాత కేంద్రంలోని వీపీ సింగ్ ప్రభుత్వం ఆమె కోసం ఐదుగురు ఉగ్రవాదులను విడిచిపెట్టింది. ఈ కేసులో మాలిక్‌తోపాటు మరికొందరు నిందితులుగా ఉన్నారు. రుబయ్యా సయీద్ అపహరణ కేసుతో పాటు, జనవరి 1990లో శ్రీనగర్‌లో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అధికారులను కాల్చిచంపిన కేసులో కూడా మాలిక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు కావాలని కోరుతూ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.