NTV Telugu Site icon

ఒడిశాలో యాస్ భీభ‌త్సం…భ‌ద్ర‌క్ జిల్లా అతలాకుత‌లం…

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన యాస్ తుఫాన్ బాలాసోర్ వ‌ద్ద తీరం దాటింది. ఈ తుఫాన్ ప్ర‌భావంతో ఒడిశా తీర‌ప్రాంతం మొత్తం అత‌లాకుత‌లం అయింది. ఒడిశాలోని 9 జిల్లాల్లో విస్తారంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఇక ఈ తుఫాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా భ‌ద్ర‌క్ జిల్లాపై ప‌డింది. భ‌ద్ర‌క్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ప్ర‌చండ వేగంతో గాలులు వీస్తుండ‌టంతో చెట్లు విరిగి ప‌డుతున్నాయి.  ఇక స‌ముద్రంలోని అల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి.  ఇక బాలేశ్వ‌ర్‌లోని చాందిపూర్ లో స‌ముద్రం ముందుకు వ‌చ్చింది.  దీంతో తీరంలోని 30 గ్రామాలు స‌ముద్రం నీటిలో మునిగిపోయాయి. తుఫాన్ ప్ర‌భావంతో గ‌త మూడు రోజులుగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర బ‌ల‌గాలు స‌హాయ‌క చర్య‌ల్లో నిమ‌గ్న‌మై ఉన్నాయి.  అటు యాస్ తుఫాన్ ప్ర‌భావం బెంగాల్ పై కూడా అధికంగా ఉన్న‌ది.  యాస్ తుఫాన్ కార‌ణంగా బెంగాల్ లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.