Site icon NTV Telugu

Wrestler Vinesh Phogat: కేంద్రమంత్రిపై రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ఆరోపణలు..

Vinesh Phogat

Vinesh Phogat

Wrestler Vinesh Phogat: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మహిళా క్రీడాకారిణులపై బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ లైంగిక వేధిపులకు పాల్పడినట్లు రెబర్లు ఆరోపిస్తున్నారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెజ్లర్ల నిరసనకు అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫోగట్ మద్దతు తెలిపారు. శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడం చాలా కష్టమని ఆమె బ్రిజ్ భూషన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

చాలా కాలం తన అధికారాన్ని, పదవిని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తిని ఎదిరించడం కష్టం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వినేష్ ఫోగట్ కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ పై సంచలన ఆరోపణలు చేశారు. మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపులకు గురువుతున్నారని, మానసికంగా హింసించబడతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఆయన కమిటీ వేసి సమస్యను అణిచివేస్తున్నారని వినేష్ ఫోగట్ మండిపడ్డారు.

Read Also: The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమా వివాదం ఏంటి?.. ఎందుకీ వ్యతిరేకత..?

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తో మాట్లాడిన తర్వాత మేము నిరసనను ముగించామని, అయితే ఆయన కమిటీ వేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకు మళ్లీ నిరసన తెలుపుతున్నామన్నారు. ఒలింపిక్స్ ఎంపిక కోెసం తీసుకువచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామన్న ఆరోపణలపై రెజ్లర్ బజరంగ్ పునియా స్పందించారు. ఇది ఒలింపిక్ నిబంధనలకు వ్యతిరేకం కాదని, ఇది లైంగిక వేధింపులకు వ్యతిరేకం అని అన్నారు.

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు ఆరోపణలపై డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 90 శాతం మంది హర్యానా క్రీడాకారులు తమ వెంటే ఉన్నారని, ఒక రెజర్లు మాత్రమే జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారని బ్రిజ్ భూషన్ అన్నారు. రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ తన ‘‘మన్ కీ బాత్’’ వినాలని కోరారు.

Exit mobile version