కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏ పదవి చేపట్టినా వన్నెతెచ్చారు.. తనకు ఏ శాఖను అప్పగించినా పూర్తిగా న్యాయం చేశారు.. అందులో సమూల మార్పులు తీసుకొచ్చిన నేర్పరి ఆయన.. అయితే, పార్లమెంట్ బోర్డు నుంచి గడ్కరీని పక్కకు పెట్టింది భారతీయ జనతా పార్టీ.. అంతేకాదు.. ఆయన ఏదైనా ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు.. సొంత పార్టీపై, నేతలపై కూడా ఓపెన్‌గా ఓపెన్‌గా మాట్లాడిన సందర్భాలు అనేకం.. ఈ మధ్య.. కేంద్ర ప్రభుత్వం సమస్యలపై తగిన విధంగా స్పందించడం లేదన్న ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. దీంతో, ఆయన బీజేపీకి దూరం అవుతున్నారా? అనే చర్చ కూడా సాగింది.. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయాయి..
Read Also: Astrology : ఆగస్టు 30, మంగళవారం దినఫలాలు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు నితిన్ గడ్కరీ.. నా మిత్రుడు శ్రీకాంత్ జిచ్కార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు.. నేను మంచి వాడినని, ఉండకూడని పార్టీలో ఉన్నానని అన్నాడు.. మంచి భవిష్యత్ కోసం కాంగ్రెస్‌లో చేరాలని నన్ను కోరాడని.. నేను ఒకే విషయం చెప్పా.. బావిలోనైనా మునుగుతాను.. కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరను.. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చవు.. అని చెప్పినట్టు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అంటే, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న నితిన్ గడ్కరీ.. పార్టీ వీడతారనే ప్రచారం సాగుతోంది.. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా బీజేపీలోనే కొనసాగుతానని, కాంగ్రెస్ చేరే ఉద్దేశం లేదని స్పష్టమైన సంకేతాలిచ్చారు..