Site icon NTV Telugu

World Record: ‘‘సియావర్ రామచంద్ర కీ జై’’ .. 33 వేలకు పైగా దీపాలతో వరల్డ్ రికార్డ్..

Ram Mandir

Ram Mandir

World Record: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రేపు మధ్యాహ్నం అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలు అట్టహాసంగా జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, 7000 మంది ప్రముఖులు అతిథులుగా, లక్షలాది మంది రామ భక్తులు ఈ వేడుక కోసం వస్తున్నారు.

Read Also: Gujarat: శ్రీరాముడి శోభాయాత్రపై రాళ్ల దాడి.. గుజరాత్‌లో ఘటన..

ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల్లో రాముడిపై ప్రజలు భక్తిని చాటుకుంటున్నారు. మహారాష్ట్రాలోని చంద్రాపూర్‌లో సోమవారం అయోధ్యంలోని రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఒకేసారి 33,258 మట్టిదీపాలను వెలిగించి “సియావర్ రామచంద్ర కీ జై” అని రాసి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించారు.

శనివారం రాత్రి పట్టణంలోని చందా క్లబ్ మైదానంలో రాష్ట్రమంత్రి సుధీర్ ముంగంటివార్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు చెందిన మిలింద్ వెర్లేకర్ మరియు ప్రసాద్ కులకర్ణి ఈ ఘనతను ధృవీకరించే పత్రాన్ని ఆదివారం ఉదయం ముంగంటివార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సర్వజనిక్ వచనాలయ్ ఇక్కడ నిర్వహించారు. వేలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

Exit mobile version