NTV Telugu Site icon

India at UNHRC: ప్రజాస్వామ్యం గురించి పాకిస్తాన్ పాఠాలు అవసరం లేదు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

India At Unhc

India At Unhc

India at UNHRC: ప్రపంచవేదికలపై పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని, మానవహక్కుల గురించి చెబుతోంది. సమావేశం ఎజెండాతో సంబంధం లేకుండా వీటి గురించి ప్రస్తావిస్తూ భారత్ ను అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్లాన్స్ ను తిప్పికొడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి పాకిస్తాన్ మాట్లాడింది. అయితే దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాకిస్తాన్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేనది స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ఉగ్రవాదం, హింసను పాకిస్తాన్ ఎగుమతి చేస్తోందని, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని భారత్ విమర్శించింది. అండర్ సెక్రటరీ డాక్టర్ పీఆర్ తులసీదాస్ మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారం చేయడానికి బదులుగా మైనారిటీల భద్రత, సంక్షేమం గురించి దృష్టి పెట్టాలని పాకిస్తాన్ కు హితవు పలికారు. యూఎన్ చేత గుర్తించబడిన 150 మంది ఉగ్రవాదులు, తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిలయంగా ఉందని, నిషేధించబడిన ఉగ్రవాదులు అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు.

Read Also: Amritpal Singh: మహిళలతో అక్రమ సంబంధాలు.. పాక్ నుంచి ఆయుధాలు.. అమృత్‌పాల్ లీలలు..

26/11 ముంబై ఉగ్రవాదుల నిందితులు స్వేచ్ఛగా పాకిస్తాన్ లో సంచరిస్తున్నారని.. దీన్ని పాకిస్తాన్ కొట్టిపారేయగలదా..? అని ప్రశ్నించారు. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పట్టుబడిన విషయాన్ని పాకిస్తాన్ కాదనగలదా..? అని భారత్ ప్రశ్నించింది. పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ సమీపంలో లాడెన్ ఆశ్రయం పొందారని, అతడిని పాక్ రక్షించిందని భారత్ వ్యాఖ్యానించింది.

జమ్మూాకాశ్మీర్ భారత్ లో ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుందని తులసీదాస్ నొక్కి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ భారత్ లో మిగిలిన ప్రాంతాలతో పాటు శాంతి, అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని అన్నారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, తప్పుడు ప్రచారం ద్వారా భారత్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా కూడా కాశ్మీర్ అభివృద్ధి సాధ్యం అయిందని అన్నారు. భారతదేశం లౌకిక దేశంగా ుందని, మైనారిటీల హక్కులను పరిరక్షించడం మా రాజకీయాల్లో ముఖ్య అంశం అని, పాకిస్తాన్ లో మాత్రం దైవదూషన్ చట్టాలు, వివక్ష, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, మైనారిటీల కిడ్నాప్ లు, హత్యలు జరుగుతున్నాయని భారత్, పాకిస్తాన్ తూర్పారపట్టింది.