World Bank lowers India’s FY24 growth forecast to 6.3%: ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్య పరిస్థితుతలతో సతమతం అవుతోంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులు అయిన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వృద్ధి దారుణంగా ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. వీటన్నింటి ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 4-5 శాతం మధ్య ఉంటుందని చెబుతున్నాయి. మరోవైపు మరో 6 నెలల నుంచి ఏడాది కాలంలో తప్పకుండా ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి.
Read Also: London School of Economics: భారతీయుడు-హిందూ అంటే ద్వేషం.. ఓ స్టూడెంట్ ఆవేదన
అయితే ఇలాంటి పరిస్థితులు మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని ప్రపంచబ్యాంక్, బ్లూమ్ బర్గ్ వంటివి అంచనావేశాయి. కాగా, తాజాగా 2024 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. గత అంచనాతో పోలిస్తే ఈసారి వృద్ధి రేటును తగ్గించింది. వరల్డ్ బ్యాంక్ భారత వృద్ధి రేటను 6.6 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది. అధిక రుణ ఖర్చులు వినియోగాన్ని దెబ్బతీస్తాయని అంచనా వేసింది. ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లను పెచింది. రుణ వ్యయాలు పెరగడం, ఆదాయ వృద్ధి మందగించడం వల్ల ప్రైవేటు వినియోగ వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం వృద్ధిని 6.9 శాతంగా అంచానా వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 శాతం అంచానా వేసిన కరెంట్ ఖాతా లోటు స్థూల దేశీయోత్పత్తిలో 2.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. అమెరికా, యూరప్ ఆర్థిక మార్కెట్లలో ఒడిదొడుకుల కారణంగా భారత్ సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి స్వల్పకాలిక పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త ధ్రువ్ శర్మ అన్నారు.