Site icon NTV Telugu

Taliban-Priyanka Gandhi: మహిళా జర్నలిస్టులను ఎందుకు పిలువలేదు.. కేంద్రంపై ప్రియాంకాగాంధీ ధ్వజం

Priyankagandhi

Priyankagandhi

ఆప్ఘనిస్థాన్ బృందం భారత్‌లో పర్యటిస్తోంది. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. అనంతరం ఢిల్లీలోని ఆప్ఘనిస్థాన్ రాయబార కార్యాలయంలో ఆ దేశ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా లేరు. కేవలం పురుష జర్నలిస్టులను మాత్రమే పిలిచి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఇది తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్రం తీరును ప్రతిపక్ష నేతలు తప్పుపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతా క్లోజ్.. బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం

ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ‘‘భారతదేశంలో అత్యంత సమర్థులైన మహిళలను అవమానించడం మన దేశంలో ఎలా అనుమతించబడిందని నిలదీశారు. దేశానికి మహిళలు వెన్నెముక, గర్వకారణం’’. అని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!

మరో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కీలక పోస్ట్ పెట్టారు. ఆఫ్ఘనిస్థాన్ మంత్రి పెస్‌మీట్‌లో మహిళలను అనుమతించనప్పుడు పురుష జర్నలిస్టులు ఎందుకు బహిష్కరించలేదని అడిగారు. మీడియా సమావేశం నుంచి వాకౌట్ చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఈ విషయం తనకు షాకిచ్చిందన్నారు.

విమర్శలపై కేంద్రం స్పందించింది. ప్రెస్‌మీట్ ఆహ్వానాలు ముంబైలోని ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ జనరల్ నుంచే ఎంపిక చేస్తారని.. ఎంపిక చేసిన జర్నలిస్టులకు మాత్రమే ఆహ్వానాలు అందాయన్నారు. ఢిల్లీలోని ఆప్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం కేంద్ర ఆధీనంలో ఉండదని.. ఇది వారి ఎంపిక మాత్రమేనని స్పష్టం చేసింది.

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం నడుస్తోంది. మహిళలపై భయంకరమైన ఆంక్షలు ఉంటాయి. విశ్వవిద్యాలయాల్లో మహిళలు రాసిన పుస్తకాలను కూడా నిషేధం విధించారు. బహిరంగంగా తిరిగే స్వేచ్ఛ కూడా ఉండదు. అన్ని విషయాల్లో ఆంక్షలు ఉంటాయి.

Exit mobile version