Site icon NTV Telugu

Relationship: ఎంత ఘాటు ప్రేమయో..! గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఆయనగా మారిన ఆమె..!

Relationship

Relationship

ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పలేం.. ఒక అబ్బాయికి ఒక అమ్మాయిపై పుట్టొచ్చు.. ఒక అమ్మాయికి మరో అబ్బాయిపై పుట్టుచ్చు.. అంతే కాదు.. ఇద్దరు అమ్మాయిల మధ్య, ఇద్దరు అబ్బాయిల మధ్య కూడా ప్రేమ పుట్టిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.. అయితే, అది మరింత ఘాటుగా మారి.. ఆమె కోసం అతడిగా మారేందుకు ఓ మహిళ ఆపరేషన్‌ చేయించుకున్న ఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఇద్దరు మహిళల ప్రేమను ఇద్దరు కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా.. ఓ మహిళ.. తన గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఏకంగా లింగమార్పిడి చికిత్స చేసుకుని వార్తల్లో నిలిచింది.

Read Also: BSNL Offer: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్‌.. ఏడాది అన్‌లిమిటెడ్..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు మహిళలు లెస్బియన్లు.. వారి మధ్య ప్రేమ చిగురించింది.. వారు జీవిత ప్రయాణంలో భాగస్వాములుగా ఉండేందుకు ఒకరికొరు ప్రమాణం చేసుకున్నారు.. కానీ, వారి కుటుంబ సభ్యులు ఆ సంబంధాన్ని అంగీకరించలేదు.. అయినా వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు.. అంతే కాదు.. తన ప్రేయసి కోసం.. ఆ ఇద్దరిలో ఓ మహిళ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. తన భాగస్వామితో పిచ్చిగా ప్రేమలో ఉన్న ఆ స్త్రీ, వారి మధ్య ఎలాంటి అడ్డంకులను తావు లేకుండా.. ఇతర వ్యక్తుల జోక్యాన్ని ఆపడానికి తన లింగాన్ని మార్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.. ఆ మహిళ వారి కుటుంబాలను ఒప్పించడానికి అన్ని మార్గాలను ప్రయత్నించింది, కానీ, ఆమె ప్రయత్నాలు ఫలించలేదు.. వేరే మార్గం లేకపోవడంతో, ఆమె తన లింగాన్ని మార్చుకోవాలని నిర్ణయానికి వచ్చిందట.. దీంతో, ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది ఆ జంట.. సదరు మహిళకు టెస్టోస్టెరాన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ ఇస్తామని వైద్యులు తెలిపారు.. అయితే, ఆమె.. అతడిగా మరేందుకు దాదాపు 18 నెలలు పడుతుందని తెలిపారు.. లింగ మార్పిడి తర్వాత ఆమె గర్భందాల్చే అవకాశం ఉండదని వైద్యులు స్పష్టం చేశారు..

డాక్టర్ మోహిత్ జైన్ ఇండియా మాట్లాడుతూ.. మహిళకు టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఇవ్వబడుతుంది.. టెస్టోస్టెరాన్ థెరపీ ఛాతీ వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తుందని తెలిపారు.. ఇక, లింగ మార్పిడియోక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెబుతూ.. లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత మహిళ గర్భం దాల్చి గర్భవతి అయ్యే పరిస్థితి ఉండబోదన్నారు.. ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారి మరియు దాదాపు 18 నెలల వ్యవధిలో ఇది పూర్తవుతుందని భావిస్తున్నట్టు వివరించారు.. మహిళ యొక్క పూర్తి ఆరోగ్య పరీక్ష జరిగిందని.. ఆమె ప్రస్తుతం బాగానే ఉందన్నారు డాక్టర్‌ మోహిత్‌ జైన్. మొత్తంగా.. ఆమె కోసం.. ఆమె.. ఆయనగా మారేందుకు శస్త్రచికిత్సకు సిద్ధపడి వార్తల్లో నిలిచింది.

Exit mobile version