King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- ఇంట్లోకి ప్రవేశించిన 10 అడుగుల రాచనాగు
- రంగంలోకి దిగిన 'స్నేక్ లేడీ'
- 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ఓ మహిళ అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించింది. సుమారు 10 అడుగుల పొడవున్న విషపూరిత రాచనాగు (కింగ్ కోబ్రా) ఇంట్లోకి ప్రవేశించడంతో భయాందోళనకు గురైన కుటుంబాన్ని కాపాడేందుకు ఆమె రంగంలోకి దిగింది. అత్యంత నైపుణ్యంతో పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టడంతో ఆమె చర్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంట్లోకి ప్రవేశించిన 10 అడుగుల రాచనాగు
ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని బగాహా జిల్లా, వాల్మీకినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషహా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మున్నీ లాల్ ఇంట్లోకి సుమారు 10 అడుగుల పొడవున్న రాచనాగు ప్రవేశించింది. పామును చూసిన వెంటనే కుటుంబ సభ్యులు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చెందారు.
Also Read
- Delhi Gang Rape Case: యూఏఈ నుంచి కామాంధుడి అప్పగింత!
- US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
- Assam Govt Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఉద్యోగం రద్దు!
- Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?
రంగంలోకి దిగిన ‘స్నేక్ లేడీ’
సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతంలో ‘స్నేక్ లేడీ’గా పేరుగాంచిన జానకి దేవి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి తొందరపాటు చేయకుండా, శిక్షణతో కూడిన పద్ధతిలో రాచనాగును సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దానిని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సకాలంలో చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్ వల్ల పెను ప్రమాదం తప్పింది.
వర్షాకాలంలో పాములు బయటకు రావడం సహజం
వాల్మీకినగర్ రేంజర్ సత్యం కుమార్ మాట్లాడుతూ, వర్షాకాలంలో వాల్మీకి టైగర్ రిజర్వ్‌కు సమీపంలోని గ్రామాల్లో విషపూరిత పాములు తరచుగా నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయని తెలిపారు. అలాంటి సమయంలో ప్రజలు భయపడకుండా ఉండాలని, పాములను స్వయంగా పట్టుకునేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. పాము కనిపించిన వెంటనే అటవీ శాఖకు లేదా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం ఇవ్వాలని కోరారు.
రాచనాగు ఎంత ప్రమాదకరం?
రాచనాగు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. దీని విషం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాచనాగు కాటు వేస్తే వెంటనే వైద్య చికిత్స పొందడం అత్యంత అవసరం. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది.
జానకి దేవి సేవలకు ప్రశంసలు
వాల్మీకినగర్‌కు చెందిన జానకి దేవి చిన్నప్పటి నుంచే పాములను రక్షించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేవలం 12 ఏళ్ల వయసులోనే ఆమె ఈ సేవను ప్రారంభించారు. ఇప్పటివరకు వేలాది విషపూరిత పాములను సురక్షితంగా రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో పలుమార్లు పాముకాటుకు గురైనప్పటికీ, ప్రజల ప్రాణాలను కాపాడడం, వన్యప్రాణులను సంరక్షించడం అనే లక్ష్యంతో ఆమె తన సేవలను కొనసాగిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
జానకి దేవి రాచనాగును అత్యంత ధైర్యంగా పట్టుకుని సురక్షితంగా తరలిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యసాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తూ, వన్యప్రాణుల సంరక్షణలో ఆమె చేస్తున్న సేవలను కొనియాడుతున్నారు.
जिन महिला के गले में आप किंग कोबरा देख रहे हैं वो हैं बिहार के बगहा में वाल्मीकिनगर की जानकी देवी और लोग उन्हें 'स्नेक लेडी' के नाम से जानते हैं.
वाल्मीकिनगर के विशाहा गांव में उस समय अफरा-तफरी मच गई, जब एक आदमी के घर में करीब 10 फीट लंबा जहरीला किंग कोबरा निकल आया. तुरंत… pic.twitter.com/hna8qso1S8
— Kishor Joshi (@KishorJoshi02) July 16, 2026
తాజావార్తలు
-
Delhi Gang Rape Case: యూఏఈ నుంచి కామాంధుడి అప్పగింత!
-
Meerpet Horror: కసాయి అల్లుడు.. కత్తులతో మారణహోమం!
-
Vangaveeti Radha : నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. మేయర్‌గా బాధ్యత మరింత పెరిగింది
-
Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
-
Last Man in Tower : కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటున్న రిటైర్డ్ టీచర్!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..