woman killed son’s classmate in Puducherry:
అభం శుభం తెలియని పసివాడు.. బాగా చదువుకోవడమే అతను చేసిన తప్పయింది. ఓ పిల్లాడి తల్లికి కోపం వచ్చింది.. అసూయ కలిగింది. నా కొడుకు కంటే బాగా చదువుతావా.,. నీ పని చెబుతా అంటూ అతని మీద దాష్టీకం చూపించింది. శీతలపానీయంలో విషం కలిపి ఇచ్చిందో తల్లి… పుదుచ్చేరిలోని కారైక్కాల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన జరిగింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సహాయరాణి విక్టోరియాను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి చికిత్స పొందుతూ 8 తరగతి విద్యార్థి మణికందన్ మృతిచెందడం మరింత విషాదం నింపింది.
తన కొడుకు ఆనందం కోసం మరొకరి కొడుకును దారుణంగా చంపింది. తన కొడుకు కన్నా ఎక్కువ మార్కులు రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ మహిళ ఏకంగా.. ఓ విద్యార్థినే విషమిచ్చి చంపింది. కొడుకు క్లాస్‌మెట్‌ను కొడుకులాగే చూసుకోవాలనే సోయి మరిచి ప్రవర్తించింది. చివరకు కటకటాల పాలైంది. ఈ దారుణ ఘటన పుదుచ్చేరిలో జరిగింది. తన కుమారుడు క్లాస్ ఫస్ట్ రావాలనే ఉద్దేశ్యంతోనే మహిళ ఇలా చేసిందని పోలీస్ విచారణలో తేలింది. సమాజంలో పెరిగిపోతున్న మార్కుల ధోరణి తల్లిదండ్రులను, విద్యార్థులను ఏ విధంగా మారుస్తున్నాయో చూపేలా ఈ ఘటన ఉంది.
Read Also: Odisha: ప్రియురాలి గొంతు కోసి హత్య.. నిందితుడి ఆత్మహత్యాయత్నం
పూర్తి వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి కారైక్కల్ లో ఈ ఘటన జరిగింది. తన కుమారుడి కన్నా ఎక్కవ మార్కులు వస్తున్నాయని సదరు మహిళ కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపేసింది. 8వ తరగతి చదువుతున్న రాజేంద్రన్- మాలతి కుమారుడికి స్కూల్ వాచ్‌మెన్ ద్వారా విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. ఆ తరువాత విద్యార్థి మణికందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మరణించాడు మణికందన్.
సీసీ పుటేజీ ద్వారా ఈ కుట్రకు పాల్పడిన సహాయరాణి విక్టోరియాను గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేశారు. మొదటి నుంచి తరగతిలో ఫస్ట్ వచ్చే తన కుమారుడిని పక్కకు తోసి రాజేంద్రన్-మాలతిల కుమారుడు ఫస్ట్ వస్తున్నాడనే కోపంతోనే విషమిచ్చానని నిందితురాలు అంగీకరించింది.
