Sati: భర్త మరణంతో భార్య ‘సతీ సహగమనం’.. ఎక్కడంటే..

  • భర్త మరణంతో భార్య ‘సతీ సహగమనం’..
  • ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘటన..
Funeral Pyre

Funeral Pyre

Sati: భర్త మరణించిన తర్వాత కనిపించకుండా పోయిన మహిళ ‘సతీ సహగమనం’ చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ జిల్లా రాయగఢ్‌లో చోటు చేసుకుంది. ముందుగా భర్త అంత్యక్రియల సమయం నుంచి 58 ఏళ్ల మహిళ కనిపించకుండా పోయింది. దీనిపై చక్రధర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. గ్రామానికి చెందిన జైదేశ్ గుప్తా(65) ఆదివారం క్యాన్సర్‌తో మరణించాడు. అదే రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన భార్య గులాబీ గుప్తా ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

Read Also: Amit Shah: కాంగ్రెస్ ఎప్పుడూ బీసీలకు వ్యతిరేకమే..

ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. అయితే, ఆ తర్వాత ఆమెకు సంబంధించిన చీర, చెప్పులు, కళ్లజోడు ఆమె భర్త చితి దగ్గర కనిపించాయి. అక్కడ లభించిన వస్తువులను బట్టి ఆమె భర్త చితిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. చితి నుంచి ఫోరెన్సిక్ బృందం నమూనాలను సేకరించి పరీక్షలకు పంపింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.