Site icon NTV Telugu

Tamil Nadu Video: రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడ్డ మహిళ.. సిబ్బంది ఏం చేశారంటే..!

Trianaccident

Trianaccident

రన్నింగ్ ట్రైన్ ఎక్కడం గానీ.. దిగడం గానీ ప్రమాదం అని రైల్వేస్టేషన్లలో అనౌన్సెమెంట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా కొందరు ప్రయాణికులు పెడచెవిన పెడుతూనే ఉంటారు. ఇందుకు మూల్యంగా ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఓ మహిళా ప్రయాణికురాలు ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డిసెంబర్ 20న తమిళనాడులోని తాంబరం రైల్వే స్టేషన్‌లో రైలు వేగంగా కదులుతోంది. అయితే ఒక మహిళ రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ పట్టు తప్పి పట్టాల కిందకు జారిపోబోతుండగా రైల్వే ఉద్యోగి నితీష్ కుమార్ సకాలం స్పందించి కాపాడాడు. ఈ గందరగోళం మధ్య ట్రైన్ కూడా నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్ సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగికి ప్రశంసలు అందుతున్నాయి. శభాష్ అంటూ కొనియాడుతున్నారు.

లోకల్ ట్రైన్ బీచ్ వైపు వెళ్తుండగా రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రైల్వేశాఖ తెలిపింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న నితీష్ కుమార్ వెంటనే చర్య తీసుకుని మహిళ ప్రయాణికురాలను సురక్షితంగా పైకి లాగి కాపాడినట్లు వెల్లడించింది.

Exit mobile version