NTV Telugu Site icon

రెచ్చిపోయిన మద్యం మాఫియా.. మహిళా పోలీసు మృతి

liquor mafia

liquor mafia

మద్యం మాఫియా ఓ మహిళా పోలీసును బలి తీసుకుంది.. బీహార్‌లో రెచ్చిపోయిన మద్యం మాఫియా.. నాటుసారా స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లిన పోలీసులపై.. సారా తయారీదారులు తిరగబడ్డారు.. పోలీసులను పరిగెత్తించి మరీ కొట్టారు.. కర్రలతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు.. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినా లాభం లేకుండా పోయింది.. మహిళలు, చిన్నారులు ఇలా అంతా కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు.. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలు కాగా.. ఓ మహిళా పోలీసులు ప్రాణాలు కోల్పోయారు..