Kerala: మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అయింది ఓ మహిళ పరిస్థితి. పిల్లి కరిచిందని ఇంజెక్షను తీసుకునేందుకు ఓ మహిళ తండ్రితో కలిసి సామాజిక ఆరోగ్యకేంద్రానికి వెళితే.. తీరా అక్కడ వ్యాక్సిన్ తీసుకోలేదు సరికదా.. వీధికుక్క కరించింది. ఈ విచిత్ర ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీప విళింజమ్‌లో చోటుచేసుకుంది. అపర్ణ(31) అనే మహిళను పిల్లి కరిచింది. ఈ నేపథ్యంలో యాంటి రేబిస్ ఇంజెక్షన్ తీసుకునేందుకు తిరువనంతపురం నగర శివారులోని ఓ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. వైద్యం కోసం ఆరోగ్యకేంద్రానికి వెళ్లిన ఆమె.. అక్కడున్న కుక్క తోకపై పొరపాటున కాలు పెట్టింది. కుయ్యిమంటూ లేచిన కుక్క.. అపర్ణ కాలిపై కాట్లు వేసింది. వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స చేసి జనరల్ ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయం గురించి అపర్ణ తండ్రి పలు వివరాలు వెల్లడించారు. తాము ఉదయం 8 గంటలకు ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నామన్న ఆయన.. అపర్ణ తన వంతు కోసం ఒక కుర్చీపై కూర్చుని ఉందన్నారు. అయితే ఆ కుర్చీ కింద ఉన్న కుక్క హఠాత్తుగా తన కూతుర్ని కరిచిందని తెలిపారు. మేము అలారం మ్రోగించిన వెంటనే హెల్త్ సెంటర్ సిబ్బంది వచ్చారు.. మొదట అపర్ణ గాయాన్ని పట్టించుకోలేదు. అయితే ఇతర రోగులు కోపం వ్యక్తం చేశారు. తాను పక్కన ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న సబ్బును తీసుకొని తన కుమార్తె గాయాన్ని శుభ్రం చేసినట్లు అపర్ణ తండ్రి చెప్పారు. అనంతరం ఆ మహిళను 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. సరైన వైద్యం అందించారు.
Supreme Court: అబార్షన్ కోసం వచ్చే మైనర్ల వివరాలు పోలీసులకు చెప్పనక్కర్లేదు..
ఈ మధ్య ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. రోడ్డుపై నడిచి వెళ్లాలంటేనే భయమేస్తుంది. తాజాగా కేరళలో ఓ ఇద్దరు విద్యార్థులను వీధి కుక్కులు చేజ్ చేశాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే కుక్కలు వెంటాడినట్లు లేదు వేటాడటానికి వస్తున్నట్లు ఉంది. కన్నూర్ పట్టణంలో వీధి కుక్కల గుంపు రోడ్డుపై నడిచి వస్తున్న ఇద్దరు విద్యార్థులను కరిచేందుకు వెంటాడాయి. ఆ విద్యార్థులు రోడ్డుపై నడిచి వస్తుండగా వీధిలో ఉన్న కుక్కల గుంపు మొరుగుతూ విద్యార్థులపైకి వచ్చాయి. ఒకేసారి ఆరు కుక్కలు మీదకి రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు విద్యార్థులు పరుగులు తీసి వెంటనే రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి లోపలకు వెళ్లి గేటు వేశారు. ఎట్టకేలకు కుక్కల బారి నుంచి బయటపడ్డారు.
#WATCH | Kerala: Students in Kannur manage to escape unharmed as stray dogs chase them in the locality (12.09) pic.twitter.com/HPV27btmix
— ANI (@ANI) September 13, 2022