Site icon NTV Telugu

CAG on Viksit Bharat: గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్‌ భారత్‌ సాధ్యం కాదు..

Cag

Cag

CAG on Viksit Bharat: భారతదేశంలోని గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్‌ భారత్‌ లక్ష్యం చేరుకోవడం అసాధ్యం అని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్) గిరీశ్‌ చంద్ర ముర్ము తెలిపారు. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో గ్రామీణ భారతం కీలకం.. సమాఖ్య వ్యవస్థలో అధికార వికేంద్రకరణ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు. గ్రామ సభలు, స్థానిక సంస్థలకు ఇంకా తగిన గుర్తింపు దొరకలేదు.. అలాగే, దేశంలోని 50 శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే నివాసం ఉంటుందని కాగ్ చీఫ్ గిరీశ్ ముర్ము పేర్కొన్నారు.

Read Also: CM Chandrababu: సీఎం కీలక ప్రకటన.. డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు

ఇక, ప్రభుత్వ పాలన, వారి అభివృద్ధి, వారికి తగిన వనరులు అందించకుండా.. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం అందుకోవడం అంత ఈజీ కాదని కాగ్ చీఫ్ గిరీశ్ చంద్ర ముర్ము తెలిపారు. మన ప్రధాన మంత్రి చెప్పినట్లు ఒక్కొక్కరూ ఒక్కో అడుగు వేస్తే 140 కోట్ల అడుగులు అవుతాయన్నారు. అందుకే ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం అని కాగ్‌ వెల్లడించింది. దేశంలో 2.60 లక్షల పంచాయతీలు, 7 వేల స్థానిక సంస్థలు ఉన్నాయి.. స్థానిక సంస్థలను సమర్థంగా తీర్చిదిద్ది ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తే.. దేశానికి చాలా మంచిదని గిరీశ్‌ చంద్ర మర్ము చెప్పారు.

Read Also: AN-12 Plane Crash: 1968లో కూలిన సైనిక విమానం.. 56 ఏళ్ల తర్వాత 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం!

ఇక, స్థానిక సంస్థలను బలోపేతం కాకుండా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదని కాగ్ చీఫ్ గిరీశ్‌ చంద్ర మర్ము తెలిపారు. స్థానిక సంస్థలకు వెళ్లే నిధుల విషయంలో అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ది కీలక పాత్ర.. కాబట్టి సరైన అకౌంటింగ్‌ విధానాలను పాటించని మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు నిధులు సమీకరించేందుకు పర్మిషన్ ఇవ్వొద్దు.. స్థానిక సంస్థలు సరైన అకౌంటింగ్‌, ఆడిట్‌ విధానాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఉందని కాగ్ వెల్లడించింది.

Exit mobile version