NTV Telugu Site icon

Devendra Fadnavis: “అన్నంత పనిచేసిన ఫడ్నవీస్”.. 2019లో చేసిన కామెంట్స్ వైరల్..

Devendra Fadnavis

Devendra Fadnavis

Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించే దిశగా పరుగెడుతోంది. మొత్తం 288 స్థానాల్లో 220 కన్నా ఎక్కువ చోట్ల లీడింగ్‌లో ఉంది. ఇది మ్యాజిక్ ఫిగర్ 145 కంటే చాలా ఎక్కువ. మరోవైపు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) 53 సీట్లకే పరిమితయ్యేలా కనిపిస్తోంది. మరోసారి మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది.

Read Also: BMW Price Hike: కార్ల ధరలను పెంచుతున్న బీఎండబ్ల్యూ.. ఎప్పటినుంచో తెలుసా?

ఈ నేపథ్యంలో 2019లో అసెంబ్లీ సాక్షిగా దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘నా నీరు తగ్గుముఖం పట్టడం చూసి, నా ఒడ్డున ఇల్లు కట్టుకోవద్దు, నేనే సముద్రాన్ని, తిరిగి వస్తాను’ అని ప్రత్యర్థి పార్టీలను హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం శివసేన ,కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించే దిశగా బీజేపీ వెళ్తోంది. ఈ ఏడాది మార్చిలో జరిగి ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘నేను తిరిగి రావడమే కాదు, రెండు పార్టీలను చీల్చుకుని వచ్చాను. మళ్లీ అధికారంలోకి రావడానికి రెండున్నరేళ్లు పట్టింది.’’ అని ఫడ్నవీస్ తాను చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకున్నారు.

దశాబ్ధం కాలంలో కేవలం బీజేపీ మాత్రమే 100+ సీట్లను సాధించిన పార్టీగా మహారాష్ట్రలో అవతరించింది. బిజెపి 1990 నుండి అసెంబ్లీలో వరుసగా 100 సీట్లు, 123 మరియు 105 స్థానాలను గెలుచుకున్న మొదటి పార్టీగా నిలిచింది.

Show comments