NTV Telugu Site icon

Parliament Winter session: నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు..

Parlament

Parlament

Parliament Winter session: నేటి (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు సెషన్స్​ కొనసాగనున్నాయి. సెలవులు తీసి వేస్తే మొత్తం 19 రోజులు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌‌‌‌‌‌‌‌లతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు.

Read Also: Samantha: నాగచైతన్య మీద ఇలా ఓపెన్ అయిపోయిందేంటి?

అయితే, ఈ అఖిలపక్ష భేటీలో 30 పార్టీలకు చెందిన 42 మంది నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌పై అమెరికా చేసిన లంచం ఆరోపణలు, మణిపూర్​ అల్లర్లు, తదితర విషయాలపై ఈ సమావేశాల్లో చర్చించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే, కాలుష్యం, రైలు ప్రమాదాలు లాంటి అంశాలపై కూడా డిస్కస్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ కోరారు. బిజినెస్ ను పక్కన పెట్టి తాము డిమాండ్ చేస్తున్న పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్​ పై చర్చ జరపాలని పేర్కొన్నారు.

Read Also: GPS: జీపీఎస్‌ని నమ్మి పోతే, కారుని నదిలో ముంచింది.. ముగ్గురు మృతి..

ఇక, ఈ సమావేశాల్లో దాదాపు 16 బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల ముందుకు తీసుకు రావాలని కేంద్ర సర్కార్ యోచిస్తుంది. కొత్తగా రాష్ట్రీయ స‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌కార యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుతో పాటు పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియ‌‌‌‌‌‌‌‌న్ పోర్ట్​ బిల్లు, ప్రవేశ‌‌‌‌‌‌‌‌ పెట్టనుంది. ఇక, లోక్‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బిల్లులో ముస్లిం వక్ఫ్ బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్విభజన బిల్లు, స‌‌‌‌‌‌‌‌ముద్రం నుంచి వ‌‌‌‌‌‌‌‌స్తువులు తీసుకొచ్చే బిల్లు, రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ చట్టాల బిల్లు లిస్ట్ లోఉన్నాయి.

Read Also: Sivakarthikeyan: విజయ్, రజనీకాంత్ ల రికార్డు బ్రేక్ చేసిన అమరన్

కాగా, లోక్‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో ఆమోదం పొంది రాజ్యస‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బిల్లుల్లో భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లు పై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రాజ్యస‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో ప్రవేశ‌‌‌‌‌‌‌‌ పెట్టి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ముఖ్య బిల్లుల్లో… చమురు క్షేత్రాల సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లులు ఉన్నాయి. అలాగే, కీలకమైన ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ బిల్లును సైతం ఈ సమావేశాల్లోనే సభ ముందుకు తీసుకొచ్చే చాన్స్​ ఉందని పార్లమెంట్ వర్గాలు చెప్తున్నాయి. దీనికి తోడు సివిల్ కోడ్ బిల్లుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.