Site icon NTV Telugu

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..!

Parliament Winter Session

Parliament Winter Session

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటు సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సభ సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలని కేంద్రమంత్రి కోరారు.

ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: మోడీ కారణంగా నా ర్యాలీ ఆలస్యమైంది.. ఖర్గే ఆరోపణలు

గత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరసనలు, ఆందోళనలతోనే గడిచిపోయింది. బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ సర్వేపై విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. అన్ని రోజులు ఇదే ఆందోళనలు కొనసాగాయి. గందరగోళం మధ్యే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 21న ప్రారంభమైన నెల రోజుల సమావేశాల్లో 37 గంటల 7 నిమిషాలు మాత్రమే వ్యవహారాలు జరిగాయని లోక్‌సభ సచివాలయం తెలిపింది. ఈ సమావేశంలో 120 గంటల పాటు చర్చలు జరపాలని అన్ని పార్టీలు సెషన్ ప్రారంభంలోనే నిర్ణయించాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇక రాజ్యసభలో 41 గంటల 15 నిమిషాల పాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Israel-Iran: మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి హత్యకు ఇరాన్ కుట్ర.. ఆరోపణలు ఖండించిన టెహ్రాన్

Exit mobile version