Site icon NTV Telugu

Madhyapradesh Minister: అలా చేస్తే తలక్రిందులుగా వేలాడదీస్తా.. అధికారికి మంత్రి బెదిరింపులు

Madhyapradesh Minister

Madhyapradesh Minister

Madhyapradesh Minister: మధ్యప్రదేశ్‌ మంత్రి రాంఖేలవాన్‌ పటేల్ ఫుడ్ డిపార్ట్‌మెంట్ అధికారులను బెదిరిస్తున్నట్లు ఉన్న వైరల్‌ ఆడియో క్లిప్ కలకలం రేపింది. ఆ క్లిప్‌లో మంత్రి అధికారులను బెదిరిస్తున్నట్లుగా ఉంది. ‘అమర్‌పతన్‌ నియోజకవర్గంలో ఏ వ్యాపారిపైనా కేసు పెట్టొద్దు.. ఒకవేళ పెడితే మిమ్మల్ని తలక్రిందులుగా వేలాడదీస్తాను’ అంటూ మంత్రి బెదిరించినట్లు ఆ క్లిప్‌లో ఉంది. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆహార కల్తీకి సంబంధించిన ఘటనలో అధికారులను మంత్రి బెదిరించినట్లు సమాచారం. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో సందర్శించవద్దని, అక్కడి వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బెదిరించినట్లుగా ఆ ఆడియో క్లిప్‌లో ఉంది.

Supreme Court: అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు

ఇలా ఆ మంత్రి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2019లో వివాదాల నుంచి బయటపడేందుకు తోటి బీజేపీ నాయకులకు ప్రధాని మోడీ హెచ్చరికలు చేసినా ఆయన ప్రభావితం కాలేదు. ఒకానొక సమయంలో జైలు నుంచి విడుదల చేయించడానికి పార్టీ రక్తం చిందిస్తుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సాత్నా జిల్లాలోని రాంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో మున్సిపల్ అధికారిపై దాడికి పాల్పడినందుకు అరెస్టయిన రామ్ సుశీల్ పటేల్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుండా ఆందోళనలు జరుగుతాయని హెచ్చరికలు చేశారు. “రామ్ సుశీల్ పటేల్‌ను జైలు నుంచి విడుదల చేయండి. ఆయనను బయటకు తీసుకురావడానికి బీజేపీ నేతలు రక్తం చిందించడానికి కూడా సిద్ధం” అని ఆయన అన్నారు.

Exit mobile version