Sonam Wangchuk: కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణ డిమాండ్లపై పర్యావరణ కార్యకర్తల కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం లడఖ్ అధికారుల్ని చర్చలకి ఆహ్వానించకుంటే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి నిరాహార దీక్ష చేస్తానని ఆదివారం హెచ్చరించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. లడఖ్ అపెక్స్ బాడీ లెహ్ (ABL) మరియు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఇటీవల కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్ పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీకి తమ డిమాండ్లతో మెమోరాండం సమర్పించారు.
ఎన్నికల సమయంలో తాను ప్రభుత్వాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలని కోరుకోలేదని, ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కుదురుకున్న తర్వాత ఖచ్చితమైన చర్యలు తీసుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. మెమోరాండం సమర్పించిన తర్వాత కేంద్రం తమ నేతల్ని చర్చలకు ఆహ్వానిస్తుందని అనుకుంటున్నామని, లేకపోతే ఆగస్టు 15 నుంచి రెండో రౌండ్ నిరసనల్ని ప్రారంభిస్తామని చెప్పారు. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తానను 28 రోజుల నిరాహారదీక్ష ప్రారంభిస్తామని చెప్పారు.
పర్యావరణంగా బలహీనంగా ఉన్న లడఖ్ ప్రాంతంలో వనరుల దోపిడిని అడ్డుకోవడంతో పాటు ఈ ప్రాంతానికి గిరిజన ప్రాంత హోదా, పూర్తి రాష్ట్ర హోదాను అందిస్తామనే వాగ్దానాన్ని ప్రభుత్వం ఉపసంహరించున్నట్లు ఆయన ఆరోపించారు. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (LAHDC) అనుమతి లేకుండానే లడఖ్‌లో సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం భూమిని కేటాయిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ కౌన్సిల్‌ని పట్టించుకోకుండా పై నుంచే అనుమతుల్ని ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో లడఖ్ ప్రజలు భయపడుతున్నారని చెప్పారు.
Read Also: VIDEO: కుమారస్వామి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం.. మీడియాతో సమావేశంలో ఘటన..
ఏడాదిలో 320 రోజుల పాటు ఎండ ఉండే లడఖ్ ప్రాంతం, సౌర విద్యుత్ ఉత్పత్తికి హాట్ స్పాట్‌గా ఉంది. ఇక్కడ నుంచి 35 GW సౌర విద్యుత్‌తో పాటు 100 GW ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. కేవలం సోలార్ ఎనర్జీ కోసం ఇక్కడి ప్రజలు, వన్యప్రాణుల మనుగడను పణంగా పెట్టకూడదని ఆయన అన్నారు. వాతావరణ మార్పుల్ని ఎదుర్కొనేందుకు మోడీ ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేసింది, కానీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదని ఆరోపించారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ని నిషేధించడంతో పాటు, వారు లడఖ్‌ని కార్బన్ న్యూట్రల్‌గా ప్రకటించాలని కానీ ఇవి అమలు కావడం లేదని చెప్పారు.
ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందు వాంగ్‌చుక్ 21 రోజుల పాటు నిరాహార దీక్షకు పూనుకున్నారు. లడఖ్‌కి రాష్ట్ర హోదాతో పాటు పర్యవరణంగా బలహీనంగా ఉన్న ప్రాంతాన్ని పరిశ్రమల నుంచి కాపాడటానికి ఈ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లడఖ్ ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం వివక్షకు గురైందని బౌద్ధులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ఈ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్‌లో చేర్చడం వల్ల రాష్ట్రంలోని శాసన, న్యాయ, పరిపాలన స్వయంప్రతిపత్తి అటానమస్ డిస్ట్రిట్ కౌన్సిల్(ADC) ఏర్పాటుకు దారి తీస్తుంది.