Nithyananda: నిత్యానందకు రామ మందిర ఆహ్వానం..హాజరవుతానని ప్రకటన..

Nithyananda

Nithyananda

Nithyananda: అయోధ్య రామ మందిర వేడుకకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందని వివాదాస్పద గురువు నిత్యానంద వెల్లడించారు. తాను ఈ కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. తనను తాను స్వయంప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానంద, పరారీలో ఉన్న అత్యాచార నిందితుడు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు. తనకు తాను కౌలాస దేశాన్ని సృష్టించుకుని, హిందూ మతానికి సుప్రీంగా చెప్పుకుంటున్నాడు.

Read Also: Ayodhya security: 13,000 మంది భద్రతా, బాంబ్ స్క్వాడ్స్, ఏటీఎస్.. అయోధ్యలో భద్రత కట్టుదిట్టం..

×
×
Ad

‘‘ఈ చారిత్రాత్మక, అసాధారణమైన సంఘటనను మిస్ చేయవద్దు. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు అధికారికంగా ఆలయ ప్రధాన దేవుడిగా ఆవాహన చేయబడుతాడు. ప్రపంచం మొత్తంపై దయ చూపేందుకు వస్తున్నాడు’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో నిత్యానంద కామెంట్ చేశాడు. ఈ గొప్ప కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానించారని, భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం హాజరవుతారని చెప్పారు.

నిత్యానంద డ్రైవర్ ఫిర్యాదుతో 2010లో అతనిపై అత్యాచార కేసు నమోదైంది, ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన ఇతను 2020లో ఇండియా నుంచి పారిపోయాడు. ఈక్వెడార్ దేశ సమీపంలో ఒక ద్వీపంలో “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు.