NTV Telugu Site icon

AAP: పంజాబ్ సీఎంని మార్చనున్న ఆప్..? భగవంత్ మాన్ ఏం చెప్పారంటే..

Aap

Aap

AAP: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోర పరాజయం తర్వాత పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ని మారుస్తారనే చర్చ కొనసాగుతోంది. అయితే, ఈ ఊహాగానాలపై మాన్ నవ్వుతూ స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపుర్తలా హౌజ్‌లో జరిగిన పంజాబ్ ఎమ్మెల్యేల సమావేశం రాజకీయ వేడిని పుట్టించింది.

మాన్‌ని సీఎంగా తొలగించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాడంటూ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. రాజౌరి గార్డెన్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. భగవంత్ మాన్ సరిగా పనిచేయడం లేదనే ముద్ర వేయడ ద్వారా ఆయనను తొలగిచే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వైఫల్యాలకు మాన్‌ని బాధ్యుడిని చేసి, కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలనునకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Read Also: Bird Flu Effect: చికెన్ ప్రియులకు పండగే.. కిలో రూ. 30 మాత్రమే!

అయితే, దీనిపై భగవంత్ మాన్ స్పందిస్తూ.. నవ్వుతూ ‘‘వాళ్లు చెప్పనివ్వండి’’ అని అన్నారు. పంజాబ్‌లోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దాదాపు మూడేళ్లుగా ప్రతాప్ బజ్వా ఇదే మాట చెబుతున్నారని, ఢిల్లీలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యను మూడో సారి లెక్కించండి అంటూ ఎద్దేవా చేశారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా స్థానాలు సాధించిందని భగవంత్ మాన్ ఎగతాళి చేశారు.

మేము మా పార్టీని మా రక్తం, చెమటతో నిర్మించామని, నిజానికి కాంగ్రెస్ వారికి మాత్రమే పార్టీలు మారే సంస్కృతి ఉందని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీలో 117 మంది సభ్యులు ఉంటే ఆప్‌ కి 93 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో భాగమని, ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు బాగా పనిచేశారని మాన్ అన్నారు.