Site icon NTV Telugu

India Pakistan War: భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అనేక ప్రశ్నలు..

Indvs Pak

Indvs Pak

India Pakistan War: భారత్- పాకిస్థాన్‌ మధయ యుద్ధంలో ఏం జరుగుతున్నదని ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తే.. మే 10వ తేదీన ఇరు దేశాలు కాల్పుల విరమణ చేసుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. భారత సైన్యం పోరాటం చేస్తున్న సమయంలో మోడీ సర్కార్ అకస్మాత్తుగా కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటని భారతీయ పౌరులు ప్రశ్నిస్తున్నారు.

Read Also: Annamayya District: ఇంటర్ విద్యార్థినికి లైంగిక వేధింపులు.. కాలేజ్ కరస్పాండెంట్ ను చితకబాదిన తల్లిదండ్రులు

ఇక, కాల్పుల విరమణపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఈ వార్తలను నిర్ధారించారు.
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిని మనకు అప్పగించలేదు.. ఉగ్రవాద సంస్థలను మూసేస్తామని చెప్పలేదు.. మసూద్‌ అజర్‌ లాంటి టెర్రరిస్టులు బహిరంగంగా తిరుగుతున్నప్పటికి.. పాకిస్థాన్‌ నుంచి ఎలాంటి కమిట్మెంట్‌ రాకుండా కాల్పుల విరమణకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుందని అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ సోషల్‌ మీడియా ప్రచారం చేస్తున్నట్టు భారత్‌ షరతులకు పాక్‌ తలొగ్గి ఉంటే.. వాటిని దేశ ప్రజలకు తెలిపాలని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు.. ప్రధాని మోడీ వ్యూహాల గురించి సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్న కమల దళం, వాట్సాప్‌ యూనివర్సిటీఒక్కసారిగా సైలెంట్ అయింది. ఈ విషయాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక అయోమయంలో పడ్డాయి.

Read Also: MLC Kavitha : భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

అయితే, కొంతమంది బీజేపీ యాక్టివిస్టులు పాకిస్థాన్‌ ప్రధాని వచ్చి మోడీ కాళ్లపై పడి ప్రాధేయపడుతున్నట్టు ఏఐ ఫొటోలు సృష్టించి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. కానీ, అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు జరిగింది? ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ దొరకని మిస్టరీగా ఉండిపోయింది. అసలు ఎందుకు యుద్ధం మొదలు పెట్టినట్టు?.. దాని వల్ల ఏం సాధించినట్టు?.. ఎందుకు ఆపినట్టు? అనే ప్రశ్నలు ప్రతి సగటు భారతీయుడి నోట వస్తున్న మాట. ఇక, 1965లో లాల్‌బహదూర్‌ శాస్త్రి నేతృత్వంలో భారత సైనికులు లాహోర్‌ వరకు వెళ్లిన విషయాన్ని నెట్టింట గుర్తు చేస్తుండగా.. మరోవైపు, ఇందిరాగాంధీ హయంలో 1971లో 13 రోజుల్లోనే పాక్‌తో యుద్ధాన్ని ముగించి బంగ్లాదేశ్‌ను వేరు చేసిన విషయాన్ని వైరల్ చేస్తున్నారు. అప్పట్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

Read Also: Mother’s Day 2025: అలుపెరుగని శ్రమజీవి అమ్మకు.. స్పెషల్‌ విష్..!

కాగా, నిజానికి పాకిస్థాన్‌ ఇప్పుడు ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది. ఆ దేశం దగ్గర సరైన ఆయుధాలు, ఆర్థిక బలమూ లేదు.. అటు అఫ్గానిస్థాన్‌.. ఇటు బలూచిస్తాన్‌తో నిత్యం సరిహద్దు సమస్యలు ఎదుర్కొంటుంది. టర్కీ మినహా ఇతర ముస్లిం దేశాలు పెద్దగా పాకిస్తాన్ కు సహకరించే పరిస్థితి కూడా కనిపించడం లేదు.. ఇలాంటి సమయాన్ని భారత్ ఉపయోగించుకోకుండా.. కాల్పుల విరమణ చేసుకోవడంపై దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, సైనిక బలగాలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చి ఉంటే పాకిస్థాన్‌ను లొంగదీసుకునే వారు.. మోడీ సర్కార్ అలా చేయకపోవడం చారిత్రక తప్పిదమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read Also: Indira Gandhi 1971 Decision: పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెట్టింట 1971లో ఇందిరా గాంధీ నిర్ణయంపై చర్చ

మరోవైపు, పాక్‌ నుంచి బలూచిస్థాన్ ను విడగొట్టడంతో పాటు పీవోకేను స్వాధీనం చేసుకోవడానికి కూడా ఇదే మంచి సమయం. పాకిస్థాన్‌కు శాశ్వతంగా గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలు భావించారు.. ఇందుకోసం ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నమని కూడా తెలిపారు. అందుకోసమే దేశంలోని ప్రతి ఒక్కరు మోడీ సర్కార్ వెంట నడిచారు. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోయిందని అనే అభిప్రాయాలు సోషల్‌ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

https://twitter.com/ramanand06/status/1921441195710173376

Exit mobile version