Mother’s Day 2025: అలుపెరుగని శ్రమజీవి అమ్మకు.. స్పెషల్ విష్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్మషం లేని ప్రేమకు ప్రతి రూపం అమ్మ.. అలాంటి అమ్మ కూ ఓ ప్రత్యేకమైన రోజు ఉండటం విశేషం. యునైటెడ్ స్టేట్స్, కెనడా, భారతదేశం తో సహా అనేక దేశాలలో ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది మే 11 న వచ్చింది. అంటే నేడే. 1908లో అమెరికన్ కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లి దాతృత్వ ప్రయత్నాల నుంచి ప్రేరణ పొంది, మొదటి మదర్స్ డే వేడుకను నిర్వహించాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రారంభమైంది. తల్లుల అపారమైన ప్రేమ, బలం, త్యాగాని ప్రతికగా మధర్స్ డే ఒక ప్రత్యేక సందర్భంగా మారింది. కానీ నేటి సమాజం చాలా మారింది. ఇంట్లో ఉండాల్సిన తల్లిదండ్రులు రోడ్డు మీద ఉంటున్నారు.
Also Read : Mrunal Thakur : ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేను..
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
కాయ కష్టం చేసి పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చి .. ఒక ఇంటి వాడిని చేసినందుకు .. రుణం తీర్చుకోక పోగా ఇంటి నుంచి బయటకు గెంటెస్తున్నారు. ఇంకొంత మంది వృద్ధాశ్రమంలో ఉంచి నెలకు కొంత డబ్బును పంపిస్తున్నారు. వారి ఇంట్లో వారికే చోటు లేకుండా చేస్తున్నారు. ఇందుకు కారణం కోడుకులు, కోడలు, కూతుర్లు, అల్లుళ్లు అని చెప్పలేం. ఎందుకంటే ఒక్కో ఇంటి కథ ఒక్కోలా ఉంటుంది. ఎలా ఉన్నప్పటికీ అమ్మని రోడ్డున పడేసిన వాడు మట్టిగొట్టుకు పోవడం మాత్రం తథ్యం. తల్లిని నిరాదరణకు గురి చేస్తున్న పిల్లలపై, ప్రతి తల్లి అంతులేని ప్రేమను కనబరుస్తుంది. బిడ్డ పుట్టినప్పటినుంచి పెరిగి పెద్దయ్యే వరకు మాత్రమే కాదు, వాళ్లకు పెళ్లిళ్ళు, వాళ్ల పిల్లలు పెద్ద వాళ్ళు అవుతున్న సరే తల్లికి తమ పిల్లలు ఇంకా చిన్నపిల్లలుగా కనపడతారు..
బ్రతికున్నంత కాలం వాళ్ళ మీద పరిపూర్ణమైన ప్రేమను చూపించేది తల్లి మాత్రమే. బిడ్డలకు చిన్న కష్టం వచ్చిందన్నా సరే తల్లి అల్లాడి పోతుంది. అటువంటి తల్లిని ఈరోజు చాలామంది నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. అమ్మ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మదర్స్ డే వంటి రోజులు వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు.. ప్రతి రోజు అమ్మ పట్ల కాస్తంత ప్రేమ చూపిస్తే చాలు ఆమె ఎంతో సంతోషపడి పోతుంది. తిన్నావా అమ్మ.. అనే ఒక్క పలకరింపు చాలు.. ఆ తల్లి ఆనందానికి అవదులు ఉండవు. ముఖ్యంగా వయసు మీద పడిన తర్వాత ప్రతి తల్లి పిల్లల నుంచి కోరుకునేది కూడా కాస్త ప్రేమ. ఆ ప్రేమను అందించగలిగితే చాలు.
జీవితంలో ఎంతో సాధించాం.. ఎంతో ఎదిగామని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర చాలా విలువైనది. పిల్లల విజయంలో తల్లి నిస్వార్థమైన సేవ చేస్తుంది. అటువంటి అమ్మను ఒక్క మదర్స్ డే రోజు మాత్రమే కాదు.. ప్రతిరోజు ప్రేమగానే చూడాలి. వారు చేతకాని వారు అయ్యారంటే.. వారి శ్రమకు ఫలితం నీ విజయం అని గుర్తు పెట్టుకో.. ఈ కాలంలో కుటుంబంతో గడిపేంత సమయం లేక పోవచ్చు కానీ.. పోయింది ఎలాంటిదైనా ఏదో ఓ రూపంలో దక్కుతుంది. కానీ అమ్మ ప్రేమ మాత్రం దక్కదు ఇదోకటి గుర్తుపెట్టుకోండి. మనం పుట్టినప్పుడు అమ్మ కళ్ళలో ఎంత ఆనందం ఉంటుందో.. తిరిగి వేళ్లే క్షణం కూడా అంతే ఆనందం మనం ఇవ్వాలి.. అప్పుడే మన జన్మకు ఒక అర్థం పరమర్థం దొరుకుతుంది..
- Tags
- Mother’s Day 2025
- Spatial
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!