Jagdeep Dhankhar Resign: భారత ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు అనే అంశం దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే, గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వానికి జగదీప్ ధన్ఖడ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. వీరి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాగా, 6 నెలలుగా ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రభుత్వం మధ్య నివురుగప్పిన నిప్పులా విభేదాలు కొనసాగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయటకు వచ్చింది.. దాదాపు 6 నెలలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జగదీప్ ధన్ ఖడ్ మధ్య సమావేశం జరగలేదని తెలుస్తుంది. ఈ 6 నెలలుగా ఉపరాష్ట్రపతి విదేశీ పర్యటనలు కూడా రద్దు అయినట్లు సమాచారం. ఇక, పదవికి ధన్ ఖడ్ రాజీనామా ఆమోదం తర్వాత ప్రధాని మోడీ ట్వీట్ చేయడం సంచలనం రేపుతుంది. ధన్ ఖడ్ ఆరోగ్యం బాగుండాలని ప్రధాని మోడీ ఆ పోస్టులో ఆకాంక్షించారు.
Read Also: Tirumala: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అన్యమత ఉద్యోగులపై చర్యలు!
కాగా, ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్ఖడ్ నిర్ణయంలో లోతైన కారణాలు ఉన్నాయి.. నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఏదో జరిగింది అని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, ధన్ఖడ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్కు కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరుకాలేదు అని ఆరోపించారు. వాళ్లిద్దరూ బీఏసీకి రాకపోవడంపై ధన్ఖడ్కు సమాచారం ఇవ్వలేదు.. దీంతో జేపీ నడ్డా, కిరణ్ రిజిజు గైర్హాజరుపై ధన్ఖడ్ తీవ్రంగా స్పందించారు.. రాజ్యసభ నిబంధనల విషయంలో ఆయన కఠినంగా వ్యవహరించారని జైరాం రమేష్ పేర్కొన్నారు.
Read Also: Revenge Murder: తల్లిని అవమానించాడని, 10 ఏళ్ల తర్వాత ప్రతీకారం.. సినిమాకు మించిన స్టోరీ..
అయితే, జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడం ఆయనకు ఇష్టం లేదు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజీనామా ఎందుకు చేశారో ఆయనకే తెలుసు అని పేర్కొన్నారు. ఇక, బీఏసీ సమావేశానికి హాజరుకాకపోవడంపై కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. మీటింగ్ కు రావడం లేదని ధన్ఖడ్కు ముందే సమాచారం ఇచ్చామని చెప్పారు. తాను సమావేశానికి రాకపోవడంపై ధన్ఖడ్ సీరియస్ అయ్యారన్న కాంగ్రెస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాము ఎప్పుడూ రాజ్యసభ ఛైర్మన్ స్థానాన్ని అగౌరవపర్చలేదు అని జేపీ నడ్డా వెల్లడించారు. కాగా, జగదీప్ ధన్ ఖడ్ ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు రాజీనామా చేశారు అనే అంశం ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతుంది.
https://www.youtube.com/watch?v=24C619yXTZg
