Site icon NTV Telugu

క‌రోనా కేసులు కేర‌ళ‌లో ఎందుకు కంట్రోల్ కావ‌డంలేదు… ?

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తున్నాయి.  రోజువారి పాజిటివ్ కేసులు 30 వేల నుంచి 40 వేల వ‌ర‌కూ న‌మోద‌వుతున్నాయి.  దేశంలోని మిగ‌తా రాష్ట్రాల్లో క‌రోనా కంట్రోల్లోకి వ‌చ్చినా, కేర‌ళ రాష్ట్రంలో మాత్రం అదుపులోకి రావ‌డంలేదు.  ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారేలా క‌నిపిస్తున్నాయి. రోజూ 10 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. దేశంలోని మిగ‌తా రాష్ట్రాల్లో పాజిటివిటీ శాతం 5 శాతం కంటే త‌క్కువుగా న‌మోద‌వుతుంటే, కేర‌ళ‌లో మాత్రం 10 నుంచి 15 శాతం వ‌ర‌కు న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  మొద‌టి వేవ్ స‌మ‌యంలో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో కేర‌ళ స‌ఫ‌లం అయింది.  ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ సైతం కేర‌ళ రాష్ట్రంపై ప్ర‌శంస‌లు కురిపించింది.  

Read: పద్మా పాటిల్ : ‘హ్యారీ పాటర్’లో అమ్మాయి… ఇప్పుడు అమ్మ!

అయితే, సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఇది పూర్తిగా త‌ల‌క్రిందులైంది.  సెకండ్ వేవ్ తో వ‌ణికిపోయిన మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ రాష్ట్రాలు ఆ త‌రువాత ఆ త‌రువాత క‌రోనా నుంచి మెల్లిగా కోలుకున్నాయి.  క‌రోనాపై పోరాటం చేసి విజ‌యం సాధించాయి.  కానీ, కేర‌ళ రాష్ట్రంలో మాత్రం కరోనా కంట్రోల్‌లోకి రావ‌డంలేదు.  రోజువారి కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  తాజా కేంద్రం రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం కేర‌ళ రాష్ట్రంలో 22 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  అయితే, టెస్టుల సంఖ్య పెంచామ‌ని అందుకే పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయ‌ని ప్ర‌భుత్వం చెబుతున్న‌ది.  కేర‌ళ‌లో వ్యాక్సిన్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నా, పాజిటివిటీ శాతం త‌గ్గ‌క‌పోవ‌డం విశేషం.  

Exit mobile version