NTV Telugu Site icon

Rajasthan: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది..? రిసార్ట్‌లో బందీగా ఎమ్మెల్యే కుమారుడు

Untitled 2

Untitled 2

Rajasthan: ప్రస్తుతం రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయం అందరిలో ఉత్కంఠ నెలకొలుపుతుంది. ముఖ్యమంత్రి నియామకం పైన చర్చించేందుకు ఒక రౌండ్ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా సీఎం రేసులో వసుంధర రాజే, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్, అర్జున్‌రామ్ మేఘవాల్, ఓంప్రకాష్ మాథుర్, బాబా బాలక్‌నాథ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వరుసలో మాజీ సీఎం వసుంధర రాజే పేరు ముందువరుసలో ఉంది. ఈ నేపథ్యంలో దుష్యంత్‌తో కలిసి మాజీ సీఎం వసుంధర రాజే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు. అనంతరం దాదాపు గంటన్నర పాటు ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. కాగా సంభాషణ అనంతరం బయటకు వచ్చిన దుష్యంత్‌,వసుంధర రాజే ఇద్దరూ కూడా మీడియాతో మాట్లాడకుండా ముందుకు సాగారు.

Read also:Earthquake : తమిళనాడు, కర్ణాటకల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

అయితే వసుంధర ముఖంలో చిరునవ్వు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ సంభాషణ లో ఎం మాట్లాడారు అనే విషయం పైన స్పష్టత లేదు. రాజస్థాన్‌లో ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే మరో వైపు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనా తన కుమారుడిని రిసార్ట్‌లో బంధించారని..కిషన్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే లలిత్ మీనా తండ్రి హేమ్‌రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అలానే మరో ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఉంచారనే వార్త కలకలం రేపింది. అయితే వస్తున్న ఆరోపణల పైన స్పందినచిన వసుంధర రాజే తన పైన తన కుమారుడి పైన వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అవన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు. అయితే బీజేపీ అధిష్టానం ఎవరిని ముఖ్యంత్రిగా నియమిస్తుందో అనే విషయం ఇంకా ప్రశ్నర్ధకంగానే ఉంది.