Site icon NTV Telugu

India vs NATO: వాణిజ్యంపై భారత్ని హెచ్చరించడానికి నాటో చీఫ్ ఎవరు..?

Nato

Nato

India vs NATO: రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలని అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడితో ‘నాటో’ చీఫ్‌ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై భారత్, చైనా, బ్రెజిల్ లు ఇకపై రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. దీంతో సార్వభౌమ దేశాలైన భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను లక్ష్యంగా చేసుకుని సైనిక కూటమికి అధిపతిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తలు చేయడం అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. అలాగే, భారత్ వంటి దేశాలపై బెదిరింపులు మంచిది కావనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక, యూరోపియన్ దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు.

Read Also: LV Gangadhara Sastry: పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం ఉంటది.. ఆ పదాన్ని వ్యాఖ్యానించడంతో ఎంతమంది గూగుల్ చేసారంటే..?

అయితే, వాణిజ్య వివాదాలకు ప్రపంచ వాణిజ్య సంస్థ పరిష్కారం చూపిస్తుంది. నాటోకు వాణిజ్యంపై మాట్లాడే అర్హత లేదని భారత్ పేర్కొనింది. పక్షపాత ధోరణితో విమర్శలు చేయడం నోటో చీఫ్ మార్క్ రుట్టే బంద్ చేసుకోవాలని సూచించారు. వాణిజ్య సమస్యలను పరిష్కరించే అధికార పరిధి కేవలం డబ్ల్యూటీఓ సంస్థకు మాత్రమే ఉందన్నారు. నాటో హక్కు కేవలం భద్రత పరమైన అంశాలను మాత్రమే చూసుకోవాలని తెలిపింది. మమ్మల్ని హెచ్చరించడానికి ఇంతకీ నాటో సెక్రటరీ జనరల్ ఎవరు అని ప్రశ్నించింది.

Read Also: Seethakka : బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేదు.. సీతక్క కామెంట్స్

నాటోకు వాణిజ్యాన్ని నియంత్రించే లేదు..
* నాటో కేవలం ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రించే సంస్థ కాదు.. కేవలం సామూహిక రక్షణపై దృష్టి సారించే ఒక సైనిక కూటమి మాత్రమే..
* నాటోతో సంబంధం లేని సార్వభౌమ దేశమైన భారతదేశానికి ఆ సంస్థ సెక్రటరీ జనరల్ చేసిన హెచ్చరికలు తమ హక్కులకు వ్యతిరేకం..
* అమెరికా విధానంతో నాటో సమన్వయం చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది..
* అమెరికా డాలర్‌ను బలహీనపరిచే కరెన్సీని బ్రిక్స్‌తో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.. ఇది అమెరికా వ్యతిరేక కూటమిగా ట్రంప్ చూశారు.
* ట్రంప్ ఇతర నాటో సభ్య దేశాలపై ఒత్తిడి చేస్తూ, రక్షణ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయమని ఆంక్షలు..
* మార్క్ రుట్టే హెచ్చరిక వాస్తవానికి దూరంగా డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ఎంత దారుణంగా లొంగిపోయాడో తెలియజేస్తుంది?..

Exit mobile version