Site icon NTV Telugu

Mamata Banerjee: ఇందిరాగాంధీ చంద్రుడి పైకి వెళ్లిందట.. దీదీ విచిత్ర ప్రకటన

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విచిత్రమైన ప్రకటన చేశారు. భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ చంద్రుడిపైకి వెళ్లారని తప్పుగా పేర్కొనడంతో నవ్వులపాలయ్యారు. దీనికి ముందు భారతదేశం తరుపున మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి ‘రాకేష్ శర్మ’ పేరును ‘రాకేష్ రోషన్’గా పేర్కొన్నారు. నిజానికి రాకేష్ రోషన్ బాలీవుడ్ సినీ నిర్మాత.

చంద్రయాన్-3 విజయవంతం అయినందున ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ఇందిరాగాంధీపై ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ ఛత్ర పరిషత్ (టీఎంసీపీ) వ్యవస్థాపక దినోత్సవం, 2023 సందర్భంగా జరిగిన ర్యాలీలో ఆమె సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇందిరా గాంధీ చంద్రుడిపైకి చేరుకున్నప్పుడు, అక్కడి నుంచి హిందూస్థాన్(భారత్) ఎలా కనిపిస్తుందని ఆమె రాకేష్‌ను అడిగారు. అతను ‘సారే జహాన్ సే అచ్చా’( ప్రపంచంలోనే అత్యుత్తమైంది)గా కనిపిస్తుందని జవాబు ఇచ్చారని దీదీ వ్యాఖ్యానించారు.

Read Also: Ola S1X Bookings: ఓలా ఎస్1 ఈవీ స్కూటర్ల రేంజ్ మామూలుగా లేదు.. 15 రోజుల్లో 75000 పైగా బుకింగ్స్!

చంద్రయాన్-3 విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రేవత్తలను అభినందిస్తూ.. రాకేష్ శర్మను, రాకేష్ రోషన్ గా సంబోధించి మమతా బెనర్జీ విమర్శల పాలయ్యారు. ఆగస్టు 23న చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ని చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనాల తరువాత నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ముఖ్యంగా దక్షిణ ధృవాన్ని చేరుకకున్న మొదటి దేశంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపై తిరుగుతూ అక్కడి పరీక్షలు నిర్వహిస్తోంది.

Exit mobile version