NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఆసియా కప్‌: నేడు శ్రీలంకతో బంగ్లాదేశ్‌ ఢీ.. దుబాయ్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌

* ఢిల్లీ: నేటి నుంచి జరగాల్సిన నీట్-పీజీ కౌన్సెలింగ్‌ వాయిదా

* కడప జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం.. రేపు ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర సీఎం జగన్‌ నివాళి.. మధ్యాహ్నం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష, రాత్రికి ఇడుపులపాయలో బస, 3న ఇడుపులపాయ నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్‌

* ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పర్యటన

* ప్రకాశం : యర్రగొండపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్.

* ప్రకాశం: తర్లపాడు మండలం చెన్నారెడ్డిపల్లెలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.

* ప్రకాశం: హనుమంతునిపాడు మండలం హాజీపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్..

* నెల్లూరు : కందుకూరు మండలం మోపాడులో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి..

* ప్రకాశం : మార్కాపురం ఎల్ఐసి సెంటర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.

* నెల్లూరు: ఉదయగిరిలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎం.ఎల్.ఏ. చంద్ర శేఖర్ రెడ్డి

* నెల్లూరు: కోవూరు వైసీపీ నేతలతో నేడు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం

* నెల్లూరు కలెక్టరేట్ లో సంపూర్ణ పోషన్ అభియాన్ పథకం పై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

* గుంటూరు: లయోలా స్కూల్ ఆవరణలో నేటి నుంచి రెండు రోజులు పాటు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు…. పోటీలను ప్రారంభించనున్న గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు….

* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రెండున్నర కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..

* ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో గడపగడపకి కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు..

* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..

* గుంటూరు: నేడు చేబ్రోలు మండలం వడ్లమూడిలో సంఘం డైరీ బోర్డు సమావేశం..

* సత్య సాయి జిల్లా : నేడు గోరంట్ల మండలం గౌనివారిపల్లెలో బెస్ట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషిమేళా కార్యక్రమం. పాల్గొననున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.

* అనంతపురం : గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే వైవీఆర్

* తూర్పుగోదావరి జిల్లా : నేడు ఆంధ్రా మైసూర్ గా పేరుగాంచిన రాజమండ్రి దేవి చౌక్ బాలత్రిపుర సుందరి దేవి దసరా ఉత్సవాలు ప్రారంభంలో భాగంగా నిర్వహించే రాటా మహోత్సవం

* కాకినాడ: నేటి జిల్లాలో పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి వేణు

* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు ఋషి పంచమి వ్రతం

* మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి నేడు తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.. మధ్యాహ్నం స్వామి వారి మూలబృందావనంకు వివిధ రకాల పూలతో అలంకరణ.. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులకు ఉంజలసేవ, బంగారు పల్లకి, స్వర్ణ రథాలపై ఉరేగింపు.

* నేడు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం వైసీపీ సమీక్ష సమావేశం.. ఎంపీ మార్గాని భరత్ రామ్ అధ్యక్షతన జరుగనున్న సమావేశం.

Show comments