NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ రెండు తీర్మానాలు చేయనున్న అసెంబ్లీ, ఏడు బిల్లులపై చర్చ, ఆమోదం తెలపనున్న శాసనసభ

* ప్రకాశం : ఒంగోలులో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయక మంత్రి ఏ.నారాయణస్వామి పర్యటన… కలెక్టరేట్ లోని స్పందన హాల్‌లో 160 మంది విభిన్న ప్రతిభావంతులకు 35 లక్షల రూపాయల విలువైన పరికరాలను అందించనున్న మంత్రి నారాయణస్వామి..

* విశాఖపట్నం: నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి టూర్… పెందుర్తి నియోజక వర్గం , రాంపురం గ్రామంలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ, బైక్ ర్యాలీ, తర్వాత అనకాపల్లి పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం, సాయంత్రం 77 వార్డు, నడుపూరులో జగనన్న కాలనీలో భూమి పూజ చేయనున్న సుబ్బారెడ్డి.

* నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు, నాయుడుపేటలో మున్సిపల్‌ అధికారులతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమీక్ష సమావేశం.

* నెల్లూరు: నేడు చిట్టామూరు మండలం మల్లాంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లోభాగంగా రాయబారం కార్యక్రమం

* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురం మండలం నరసాపేటలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి వేణు

* విజయవాడ: 61వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. నేడు 58వ డివిజన్‌లో రూ.39.65 లక్షలతో నీటి కాలువ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయనున్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

* నేడు ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం. హజరుకానున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

* తిరుపతి: బర్డ్ లో నేటి నుండి ఉచితంగా గ్రహణ మొర్రి ఆపరేషన్లు ప్రారంభం

* తూర్పుగోదావరి జిల్లా : నేడు టీడీపీ రాజమండ్రి అర్బన్ సర్వసభ్య సమావేశం.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అధ్యక్షతన జరుగనున్న సమావేశం

* నంద్యాల: నేడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించనున్న మంత్రి అంబటి రాంబాబు..

* అంతపురం : నేటి నుంచి గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం

* గుంటూరు : నేడు రాజధాని రైతుల రెండో రోజు పాదయాత్ర… అమరావతి నుండి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర.. రెండో రోజు మంగళగిరి నుండి ప్రారంభం కానున్న పాదయాత్ర.

* గుంటూరు: నేడు నంబూరులో చిన్న మధ్యతరగతి పరిశ్రమలపై అవగాహన సదస్సు.. హాజరుకానున్న రాజ్యసభ సభ్యుడు ఆలయ అయోధ్య రామిరెడ్డి…

* అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు కోసం రాజధాని గ్రామాల్లో రెండవ రోజు గ్రామసభలు … నేడు దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెంలో గ్రామసభలు నిర్వహించనున్న అధికారులు.

* పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం శివన్నపేటలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్న ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి

* మన్యం జిల్లా నేడు పాలకొండలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష.. హాజరుకానున్న ఎమ్మెల్యే విశ్వాసరాయి. కళావతి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్.

* నేడు శ్రీశైలంలో నందీశ్వరస్వామికి విశేషాభిషేకం, ప్రత్యేక పూజలు