* టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ ఉదయం 9.30కి ఇంగ్లండ్‌తో తలపడనున్న ఐర్లాండ్
* టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ మధ్యాహ్నం 1.30కి న్యూజిలాండ్‌ను ఢీకొట్టనున్న ఆఫ్ఘనిస్థాన్
* నేడు ఢిల్లీ నుంచి హెలికాప్టర్‌లో తెలంగాణకు రాహుల్ గాంధీ.. సాయంత్రం 5 గంటల లోపు మక్తల్ చేరుకోనున్ రాహుల్..
* చెన్నై: నయనతార దంపతుల సరోగసి వివాదంపై విచారణ పూర్తి.. నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న విచారణ కమిటీ
* నేడు తాడేపల్లిలో ఉదయం 9..30 గంటలకు వైసీపీ బీసీ ఆత్మయ సమావేశం..
* సూర్యగ్రహణం అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో పూర్తైన శుద్ధి కార్యక్రమాలు.. దర్శనాలు తిరిగి ప్రారంభం..
* బాపట్ల: అద్దంకి మండలం శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సూర్య గ్రహణం అనంతరం పునః ప్రారంభం కానున్న దర్శనాలు..
* ప్రకాశం : త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి, బాల త్రిపుర సుందరి దేవి ఆలయాల్లో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు..
* బాపట్ల : వేటపాలెం మండలం దేశాయిపేట జెడ్పీ హైస్కూల్ లో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కరణం బలరాం..
* తూర్పుగోదావరి: నేటి నుండి మూడు రోజుల పాటు ఏపీ హోంమంత్రి తానేటి వనిత ఢిల్లీ పర్యటన
* గుంటూరులో తాగునీటి పైప్ లైన్ మరమ్మత్తుల కారణంగా మధ్యాహ్నం వరకు మంచినీటి సరఫరాలో అంతరాయం… లక్ష్మీపురం, స్తంభాలగరువు, గుజ్జనగుండ్ల , ఏటీ అగ్రహారం , పండరిపురం తో పాటు పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు తాగునీటి సరఫరా నిలిపివేత…..
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి కార్తీక మాసం ఆరంభం కావడంతో రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్న స్నానఘట్టాలు.. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.,
* పల్నాడు: నరసరావుపేట మండలం లింగంగుంట్ల వద్ద 200 పడకల వైయస్సార్ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించనున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ముత్తుకూరు మండలం నేలటూరులో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలిస్తారు అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం
నిర్వహిస్తారు
* పశ్చిమగోదావరి: కార్తీక మాసం సందర్భంగా భీమవరం, పాలకొల్లు పంచారామాల్లో ప్రత్యేక పూజలు.. భారీగా తరలి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు..
* అనంతపురం : ఇవాళ జిల్లాలో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు సోమువీర్రాజు.
* విజయవాడ: రేపు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ‘వ్యవసాయ సంక్షోభం, పరిష్కార మార్గాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహణ
* విశాఖ: సింహాచలంలో నేటి నుంచి ఐదు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. మణవాల్ మహా మునుల తిరునక్షత్ర ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన ఆలయ కమిటీ
* నంద్యాల: మహానందిలో నేటి నుండి కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం
* కాకినాడ: పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం లో ప్రారంభమైన కార్తికమాస పూజలు… కార్తీక మాసం తొలి రోజు కావడంతో తెల్లవారుజాము నుండే కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు.. పదవ శక్తి పీఠం అధిష్టాన దేవతైన పురుహుతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు..
* కాకినాడ: అమరావతి రైతులు పాదయాత్రకు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో నేటి నుండి మూడు రోజులు పాటు పాదయాత్ర చేయనున్న మాజీ ఎమ్మెల్యే వర్మ
* విజయనగరం: కార్తీకమాసం సందర్బంగా నేటి నుంచి శివాలయాల్లో అభిషేకాలు… ఎస్ కోట మండలం పుణ్యగిరి, సన్యాసి పాలెం, తాటిపూడి లో కార్తీక మాస పూజలు..
* కాకినాడ: అన్నవరం సత్యదేవుని సన్నిధిలోలో ప్రారంభమైన కార్తీక సందడి.. స్వామి వారిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్న భక్తులు
* నేడు నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. ఉప్పల్-ఎల్బీనగర్ మధ్య తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
