NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పెళ్లి.. బాలీవుడ్‌ నటుడు సునిల్‌శెట్టి కుమార్తె అతియాతో పెళ్లి..

* అమరావతి: జోవో నంబర్‌ 1పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ..

* విశాఖ: ఉమ్మడి విశాఖ జిల్లాకు చేరుకున్న 45వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్స్‌.. నేటి నుంచి బూస్టర్ డోస్ పంపిణీ కోసం స్పెషల్ డ్రైవ్.. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి 500 వ్యాక్సిన్ల వరకు కేటాయింపు…

* విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈనెల 30న ప్రజాగర్జన బహిరంగ సభ.. నేడు గాజువాక ప్రాంతంలో వివిధ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం

* నెల్లూరు : కందుకూరులో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి తైక్వాండో పోటీలకు క్రీడాకారుల ఎంపిక పోటీలు..

* ప్రకాశం : తాళ్లూరు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి ఉత్పత్తుల విక్రయ మేళా..

* ప్రకాశం : ఒంగోలు జెడ్పీ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి..

* నెల్లూరు జిల్లా: ముత్తుకూరు మండలంలో పర్యటించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో రోడ్డు సేఫ్టీ వారోత్సవాలలో భాగంగా నిర్వహించే వాక్ థాన్ కార్యక్రమం.. రాజమండ్రి హై టెక్ బస్ స్టాండ్ నుండి పుష్కర్ ఘాట్ వరకు కొనసాగనున్న వాక్ థన్

* పశ్చిమగోదావరి జిల్లా: నేటి నుంచి భీమవరంలో రెండు రోజులపాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.. హాజరుకానున్న కేంద్ర మంత్రులు భారతీ ప్రవీణ్ పవార్, వి. మురళీధరన్, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. సమావేశాల్లో భాగంగా ఈరోజు శక్తి కేంద్రాల సందర్శన..

* కడప: వైభవంగా దేవుని కడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. నేడు సూర్య ప్రభ వాహనంపై దర్శనం ఇవ్వనున్న శ్రీనివాసుడు..

* అనంతపురం : కంబదూరు మండల కేంద్రంలోని గుండ్లపల్లి కాలనీ నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* అనంతపురం : నేటి నుంచి ఎస్కేయూనివర్శిటీ పరిధిలో దూరవిద్య పరీక్షాలు.

* శ్రీ శంబర పొలమాంబ జాతర నేడు తొలేళ్లు… జాతరకు 2 లక్షల మంది భక్తులు వస్తారని దేవాదాయ శాఖ అంచనా.. 700 మంది పోలీస్లతో బందోబస్తు.. భక్తుల కోసం 200 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు.

* విజయనగరం: ఆనందగజపతి ఆడిటోరియంలో నేడు మిల్లెట్స్ మహోత్సవం.. చిరుధాన్యాలతో చేసిన ఆహార ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం స్టాల్స్.

* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమానికి హాజరు.. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం.. సాయంత్రం కడియద్దలో గడపగడప కార్యక్రమానికి హాజరు.

* పల్నాడు: చిలకలూరిపేట 21 వ వార్డు లో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని…

* కర్నూలు: ఇవాళ , రేపు కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహన్ జిల్లా పర్యటన

* నంద్యాల: వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా నేడు అమ్మవారికి అభిషేక మహోత్సవం , కుంకుమార్చన . సాంస్కృతిక కార్యక్రమాలు

* నంద్యాల: మహానంది లో నేడు సోమవారం సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు, సాయంత్రం పల్లకి సేవ

* నంద్యాల: నేడు డోన్ మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం, పాల్గొననున్న ఆర్థిక మంత్రి బుగ్గన….

* పల్నాడు: నేడు మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం..

* నేడు రెండో రోజు మెదక్, సంగారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన.. మెదక్ జిల్లా నర్సాపూర్ లో మద్యాహ్నం కుల సంఘాల నాయకులతో భేటి కానున్న కేంద్ర మంత్రి.. సంగారెడ్డి జిల్లాలో ఉజ్వల పథకం లబ్దిదారులతో సమావేశం కానున్న మంత్రి పురుషోత్తం రూపాల

Show comments