Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* ఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేంద్రం..

* నేడు భారత్ వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి వన్డే.. ఉప్పల్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం..

* నేడు స్వర్గీయ ఎన్టీఆర్‌ వర్ధంతి.. ఏపీ, తెలంగాణలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించనున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

* నేడు ఖమ్మంలో బీఆర్ఎస్‌ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఢిల్లీ, కేరళ, పంజాబ్‌ సీఎంలు, మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, 5 లక్షల మంది ప్రజలు తరలివస్తారని అంచనా

* తూర్పుగోదావరి జిల్లా : నేడు జిల్లాలో హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. చాగల్లు మండలం గౌరిపల్లి గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి..

* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాట.. ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని, టిట్కో ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు అందించాలని డిమాండ్

* పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజక వర్గంలో నేడు వ్యవసాయ శాఖ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి, మాజీ మంత్రి కొడాలి నాని పర్యటన.. అత్తిలి మండలం పాలిగ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం..

* గుంటూరు: నేటి నుంచి రెండు రోజులు పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై జెడ్పీటీసీ సభ్యులు, అధికారుల సమావేశం.

* కాకినాడ: నేవీ విన్యాసాలు కారణంగా నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేత.. కాకినాడ వెళ్లే వాహనాలు పిఠాపురం మీదుగా మళ్లింపు

* గుంటూరు: మోతడకలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. హాజరుకానున్న అయ్యన్నపాత్రుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తదితరులు

* కాకినాడ: ఉమ్మడి జిల్లాలో సర్దుబాటులో భాగంగా అవసరమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎన్ జీ టీ క్యాడర్ ఉన్న ఉపాధ్యాయులను నియమించేందుకు నేడు కౌన్సిలింగ్

* శ్రీశైలంలో నేటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

* కడప నగరంలో ని 43వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా

* నేడు విశాఖకు మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు.. సాయంత్రం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనాలో లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం.. పలువురు సినీ, సాహితీ ప్రముఖులకు అవార్దులు.

* అనంతపురం : తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

Exit mobile version