NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* గుంటూరు: నేడు తెనాలిలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. తెనాలి మార్కెట్ యార్డ్‌లో వైఎస్సార్ రైతు భరోసా మూడవ విడత నిధులను బటన్ నొక్కి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న సీఎం జగన్.. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ

* నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.. ఎల్లారెడ్డి పేటలో ఏర్పాటు చేసిన వృద్ధుల సంక్షేమ కేంద్రం ప్రారంభించనున్న కేటీఆర్.. విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్న మంత్రి.. పలు పంచాయితీ భవనాల ప్రారంభం

* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: నేడు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగనున్న రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర .. ఉదయం 7 గంటలకు సింగరేణి 5 ఇంక్లైన్ లో కార్మికులతో గేట్ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం కాసింపల్లిలో ప్రారంభంకానున్న యాత్ర.. సెగ్గంపల్లి, జంగేడు, రాంనగర్, ఎల్.బి నగర్, లక్ష్మీనగర్, రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా అంబేడ్కర్ సెంటర్ కు చేరుకోనున్న యాత్ర.. సాయంత్రం 7 గంటలకు అంబేద్కర్ సెంటర్ లో కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్న రేవంత్ రెడ్డి.

* గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం- మహిళల, బాలికలకు సమానత్వంపై సదస్సు.. హాజరుకానున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ…

* బాపట్ల : చీరాల మండలం ఈపురుపాలెం శ్రీ అంకమ్మ తల్లి వార్షిక తిరుణాలలో భాగంగా అమ్మవారికి అన్నభిషేక కార్యక్రమం..

* ప్రకాశం : కనిగిరిలో వైసీపీ కార్యకర్తల సమావేశం, హాజరుకానున్న రీజనల్ కో ఆర్డినేటర్లు భూమన కరుణాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి..

* ప గో జిల్లా తణుకు లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

* తూ.గో.జిల్లా: రేపు నిడదవోలుకు సీఎం జగన్‌.. ఎమ్మెల్యే జి.ఎస్.నాయుడు కుమార్తె రిసెప్షన్ కు హాజరు.

* తిరుమల: రేపటి నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ విధానాని ప్రారంభించనున్న టిటిడి.. సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, వసతి గదులు, రిఫండ్ కౌంటర్ల వద్ద ఫేస్ రికగ్నిషన్ విధానాని ప్రవేశ పెట్టనున్న టిటిడి

* తిరుమల: మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఐదు రోజులు పాటు తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్న టిటిడి.. ఐదు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ

* తిరుపతి: నేడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర మామండూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభం.. నడింపల్లి, కొంగవారిపల్లి, కాశిపెంట్ల, కల్రోడిపల్లి, పనబాకం మీదుగా గాదంకి టోల్ గేటు వరకు సాగనున్న పాదయాత్ర

* కడప : నేడు ఆఖరి విడత రైతు భరోసా నిధుల విడుదల.. జిల్లాలో రెండు లక్షల మంది రైతులకు 42.73కోట్ల లబ్ది..

* కడప : ఏపీ స్కూల్ డవెలెప్మెంట్ ఆధ్వర్యంలో మార్చి 2న జాబ్ మేళా.. మేళాకు రానున్న వివిధ మల్టీ నేషనల్ కంపెనీలు..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం మండలం సంపత్ నగర్ లో జనం కోసం జనసేన మహాపాదయాత్ర.. గ్రామంలో రెండు రోజుల పాటు జరుగనున్న జనసేన మహాపాదయాత్ర

* శ్రీ సత్యసాయి జిల్లా : రాప్తాడు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై బూత్ కమిటీ సభ్యులు సచివాలయ కన్వీనర్ తో సమీక్ష సమావేశం.

* అనంతపురం : పెద్దపప్పూరు మండలంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పాదయాత్ర.మొదటి రోజు ముచ్చుకోట, వరదాయపల్లి , అమ్మలదిన్నె, కొత్తపల్లి గ్రామాలలో కొనసాగనున్న యాత్ర.

* అనంతపురం : రాప్తాడు మండలం అయ్యవారిపల్లిలో ఎర్రితాత స్వామి ఉట్ల పరుష పురస్కరించుకుని జిల్లా స్థాయి రాతి దూలం లాగుడుపోటీలు.

* కర్నూలు: నేడు రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముగింపు.. ఆర్డీఎస్ నుంచి ఆదోని వరకు మూడు రోజులు పాదయాత్ర చేపట్టిన బైరెడ్డి.. నేడు ఆదోనిలో బహిరంగసభ.. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టు నిలిపివేయాలని, సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మించాలని డిమాండ్

* కర్నూలు: నేడు మంత్రాలయంలో గ్రామ దేవత మంచాలమ్మకు నేడు కుంకుమ అర్చన. తులసి అర్చన వంటి విషేశ పూజలు.. అమ్మవారికి చీర జాకెట్టు, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకొనున్న మహిళలు.

* అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాప్తాడు నియోజకవర్గ స్థాయి సమావేశం. హాజరు కానున్న మంత్రి ఉషశ్రీ చరణ్ , ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

* అనంతపురం: ఆత్మకూరు మండలంలోని పంపనూరు కొండపై వెలసిన మలోబిల లక్ష్మీనరసింహాస్వామి ఉత్సవాలు.