Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు మహాశివరాత్రి.. శివనామ స్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు, ఆలయాల వద్ద భక్తుల రద్దీ

* నేడు గ్వాలియర్‌కు దక్షిణాఫ్రికా చీతాలు, ఇప్పటికే జొహన్నస్‌బర్గ్‌ నుంచి బయల్దేరిన చీతాలు.. నేడు భారీ హెలికాప్టర్‌లో శ్యోతిపూర్‌కు చీతాల తరలింపు

* రెండో రోజు ఆస్ట్రేలియాతో భారత్‌ రెండో టెస్ట్.. ఢిల్లీ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

* మహిళల టీ20 వరల్డ్‌కప్‌: నేడు ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ.. గెబెరా వేదికగా సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్‌.. ఈ మ్యాచ్‌ గెలిస్తే సెమీ ఫైనల్‌కు చేరుకోనున్న టీమిండియా

* ఏలూరు జిల్లా: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పట్టిసం వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు స్వయంగా గోదావరి జలాలను తీసుకువచ్చి ముందుగా విఘ్నేశ్వరునికి పూజ నిర్వహించిన అనంతరం వీరేశ్వర స్వామికి అభిషేకం తొలి పూజ నిర్వహించారు.

* ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట మండలం ముత్యాల వద్ద కృష్ణ ఉత్తరవాహిని మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు…

* కడప: పేండ్లిమర్రి మండలం పోలతల పుణ్య క్షేత్రంలో శివరాత్రికి భారీ ఏర్పాట్లు.. నేడు మల్లేశ్వర స్వామి కళ్యాణం..

* కడప : రేపు కడప ప్రెస్ క్లబ్ లో జిల్లా ఒలింపిక్‌ సంఘం ఎన్నికలు…

* కడప : ఈ నెల 25న కడపలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన.. రాయలసీమ స్థాయి ప్రాంతీయ టిడిపి సమావేశం స్థల పరిశీలన చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రముఖ శైవక్షేత్రం మందపల్లి శనేశ్వరస్వామి ఆలయం వద్ద శనిత్రయోదశి సందర్భగా తరలి వస్తున్న భక్తులు, శనిత్రయోదశి, మహాశివరాత్రి, మాసశివరాత్రి కలిసి రావడంతో ప్రత్యేకను పొందిన శనిత్రయోదశి.. 19 సంవత్సరాల తరువాత శనిత్రయోదశి మహాశివరాత్రి కలిసి ఒకేసారి వస్తుంది.. ఈరోజు అర్ధరాత్రి నుంచి రావులపాలెం అమలాపురం ప్రధాన రహదారిపైవాహనాలు దారి మళ్ళింపు

* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని శివానగర్ లో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం.

* శ్రీ సత్య సాయి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లేపాక్షి లో దీపోత్సవం, రుద్రహోమం.

* శ్రీ సత్యసాయి : సూగురు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి 27 అడుగుల ఏకశిలా హనుమాన్ విగ్రహం తో పట్టణంలో శోభ యాత్ర.

* తూర్పుగోదావరి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రిలోని భక్తుల పుణ్య స్నానాలతో కిటకిటలాడుతున్న స్నానఘట్టాలు.. వేలాదిగా తరలివస్తున్న భక్తులు, అన్ని స్నాన ఘట్టాల్లో జల్లు స్నానాలు ఏర్పాటు, శివాలయాల్లో బారులు తీరిన భక్తులు, లింగోద్భవ సమయం నుంఢి పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న స్నానఘట్టాలు

* నెల్లూరు: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో మహాశివరాత్రి వేడుకలు,

* నెల్లూరు: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వైసీపీ నేతలతో క్యాంప్ కార్యాలయంలో సమావేశం కానున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

* తిరుపతి: శివరాత్రి సందర్భంగా తన పాదయాత్రకు విరామం ప్రకటించిన నారా లోకేష్

* తిరుపతి: మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీకాళహస్తీ ఆలయం.. రాత్రికి స్వామివారికి నందివాహనసేవ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసినా శ్రీకాళహస్తి ఆలయ అధికారులు

* రాజన్నసిరిసిల్ల జిల్లా: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం, తెల్లవారుజామునుండే స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరిన భక్తులు, కోడెమొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు, స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం, ఉదయం 6 గంటలకు స్వామివారికి టిటిడి తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

* వేములవాడ రాజన్న క్షేత్రంలో శివ స్వాములకు నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు స్వామివారి దర్శనం.. సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి కల్యాణ మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన.. రాత్రి 11:30 నిమిషములకు లింగోద్భవ సమయంలో స్వామివారికి 11 మంది రుత్వికులచే స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్న ఆలయ అర్చకులు

* భూపాలపల్లి: కాళేశ్వరంలో మహశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ.. సుదూర ప్రాంతాలతోపాటు మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తుల రాక.. త్రివేణి‌ సంగమ గోదావరి‌ నదిలో భక్తుల‌ పుణ్యస్నానాలు.. శ్రీ‌ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలతో విశేష పూజలు.. శనిత్రయోదశి సందర్భంగా నవగ్రహల వద్ద సాముహిక శనిపూజలు నిర్వహిస్తున్న భక్తులు.. సాయంత్రం 4.30గం.శుభానంద ముక్తీశ్వర కల్యాణ మహోత్సవం‌ నిర్వహించనున్న అర్చకులు.. అర్థరాత్రి 12 గం. లింగోద్భవ పూజ.

* నిజామాబాద్‌: మహాశివరాత్రి సందర్భంగా జిల్లా కేంద్రంలోని నీల కంటేశ్వర్ ఆలయంలో పోటెత్తిన భక్తులు.. తెల్లవారుజాము నుంచి మొదలైన అభిషేకాలు అర్చనలు.. కంటేశ్వర్, శంభుని గుడి, ఉమా మహేశ్వర అలయాలలో భక్తుల రద్దీ

* ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని గణపేశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తులు

* ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర ఆలయంలో కూసుమంచి మండల కేంద్రంలోని గణపేశ్వరాలయంలో నేలకొండపల్లి మండలం లోని శివాలయాల్లో పోటెత్తిన భక్తులు

* ఖమ్మం: గుంటు మల్లన్న దేవాలయం లో తెల్లవారు జాము నుంచి భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు

* భద్రాచలంలో భక్తుల తో కిక్కిరిసిన రామలింగేశ్వరుడి దేవాలయం

* వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి శివ రాత్రి వేడుకలు. చరిత్రాత్మక దేవాలయాలు అయినా రామప్ప, , వేయి స్తంభాల గుడి, మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఖిలా వరంగల్ శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయం, కాలేశ్వరం, కురివి వీరభద్ర స్వామి దేవాలయం ప్రారంభం అయిన శివరాత్రి వేడుకలు.. తెల్లవారు జాము నుండి మహాశివ పరమేశ్వరుని దర్శించుకునేందుకు శివాలయాల్లో భారులు తీరిన భక్తులు

* హన్మకొండ: శివ రాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు నేడు హనుమకొండకు రానున్న గవర్నర్ తమిళసై సుందర్ రాజన్.. హన్మకండలో ఇండోస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాశివరాత్రి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్

* ఏలూరు జిల్లా: కలిదిండి మండలం కలిదిండిలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి తెల్లవారుజాము నుండి బారులు తీరిన భక్తులు…

* మహా శివరాత్రి సందర్భంగా కీసర లో పోటెత్తిన భక్తులు.. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం.. కీసర గుట్ట మీద నుంచి కింద వరకు కిలోమీటర్ మేర క్యూ లైన్.. ఈ రోజు రాత్రి కళ్యాణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు

* అంబేద్కర్ కోనసీమ: కోటిపల్లిలో శ్రీ చాయ సోమేశ్వర స్వామివారి ఆలయం మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా భక్తుల రద్దీ.. తెల్లవారు జామునే వేలాది గా తరలి వచ్చిన భక్తులు, గోదావరి నదిలో పుణ్య స్నానము లు ఆచరించి స్వామి వారిని దర్శించుకునీ అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

* సంగారెడ్డి: బసవేశ్వర ఎత్తిపోతల పథకంలో తొలి అడుగు .. నేడు బోరంచలో పంప్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్న మంత్రి హరీష్ రావు.. 1774 కోట్ల రూపాయలతో బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం.. ప్రాజెక్టు పూర్తయితే లక్ష అరవై ఐదు వేల ఎకరాలకు అందనున్న సాగునీరు

* మెదక్: పాపన్నపేట (మం) నాగసన్ పల్లిలోని ఎడుపాయల వనదుర్గ మాత ఆలయంలో శివరాత్రి వేడుకలు.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి హరీష్ రావు

* కొమరంభీం జిల్లా: కాగజ్‌నగర్‌ మండలంలోని ఈస్ గాం శివమల్లన్న స్వాము ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు.. ఉదయం నుండి స్వామి వారికి దర్శనానికి తరలి వచ్చిన భక్తులు.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు.. స్వామి వారిని దర్శించు కోవడానికి ఉదయం నుండే బారులుతీరిన భక్తులు.

* మంచిర్యాల: జన్నారం మండలం కవ్వాల్ టైగర్ జోన్ లో ఇవ్వాళ, రేపు బర్డ్ వాక్ ఫెస్టివల్.. వివిధ ప్రాంతాల నుంచి తరలి రానున్న పక్షి ప్రేమికులు.

Exit mobile version