NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేటి నుంచి ఆస్ట్రేలియాతో భారత్‌ రెండో టెస్ట్‌.. ఢిల్లీ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌

* తన కెరీర్‌లో ఇవాళ వందో టెస్ట్‌ ఆడనున్న చటేశ్వర పుజారా

* నేడు బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీ శ్రేణులు, కేసీఆర్‌ అభిమానులు

* నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగించిన హైకోర్టు.. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం

* ఏలూరు జిల్లా: నేడు పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. స్పిల్‌ వేతో పాటు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను పరిశీలించనున్న అంబటి

* శివసేన చీలిక కేసుపై ఇవాళ తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం

* రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. నేటి నుండి మూడు రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలు. ఆర్జిత సేవలు రద్దు

* భూపాలపల్లి: కాళేశ్వరంలో నేటి నుండి‌ మహశివరాత్రి ఉత్సవాలు.. మూడు రోజులపాటు కొనసాగనున్న శివరాత్రి ఉత్సవాలు.. రేపు శివరాత్రి సందర్భంగా శ్రీ కాళేశ్వర‌ ముక్తీశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు.

* బాపట్ల : చీరాలలో ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సమీక్ష, హాజరుకానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..

* ప్రకాశం : త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి, లలితా త్రిపుర సుందరిదేవీ ఆలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు..

* తూర్పుగోదావరి జిల్లాలో హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. బిక్కవోలు మండలం కపవరం గ్రామంలో బైబిల్ మిషన్ మహా సభలలో పాల్గొననున్న మంత్రి.. రాత్రి కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో ఓ వివాహ రిసెప్షన్ కి హాజరు

* అల్లూరి సీతారామరాజు జిల్లా: నేడు పాడేరు ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి కాఫీ రైతులు సిద్ధం.. ప్రోత్సాహక నిధుల బకాయిలు చెల్లించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న గిరిజ కాఫీ రైతు సంఘం..

* అనంతపురం : పామిడి మండలం వంక రాజు కాలువ గ్రామ సమీపంలో రాష్ట్ర స్థాయి రాతిదూలం లాగుడు పోటీలు

* శ్రీ సత్య సాయి: నేటి నుంచి లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు.

* నెల్లూరు జిల్లా: నేడు పొదలకూరు, మనుబోలు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

* విశాఖ: నేడు నగరానికి వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించే అవకాశం.

* తూర్పుగోదావరి జిల్లాలో నేటితో ముగియనున్న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. సామర్లకోట నుండి మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానున్న రోడ్డు షో.. వేట్లపాలెం, పెద్దాడ, బిక్కవోలు, బలభద్రపురం, రాయవరం, రామవరం మీదుగా అనపర్తి చేరుకోనున్న రోడ్డు షో.. సాయంత్రం అనపర్తిలో భారీ బహిరంగసభ

* గుంటూరు: నేడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరులో వేడుకలు నిర్వహించనున్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు..

* గుంటూరు: కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పెన్షన్ల విధానాన్ని పరిశీలించేందుకు నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందం..

* తిరుపతి: నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. ఉదయం బైరాజు కండ్రిక విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం, కొత్తకండ్రిక, శివనాథపురం, రాజీవ్ నగర్, పీవీఆర్ గార్డెన్స్, బంగారమ్మ గుడి, శ్రీకాళహస్తి పట్టణం, ఎన్టీఆర్ సర్కిల్, బీపీ అగ్రహారం మీదుగా పొన్నాలమ్మ దేవాలయం వరకు సాగనున్న పాదయాత్ర.

* నంద్యాల: మహానంది క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. నేడు ఉదయం సూర్యప్రభ వాహన సేవ , రాత్రి రావణ వాహన సేవ.. మహానంది క్షేత్రంలో రేపు జరిగే శివరాత్రి లింగోద్భవం కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఆర్ డి ఓ, ఆలయ ఈవో సమీక్ష

* నేడు శ్రీశైలంలో ఏడోవరోజుకు చేరుకున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం గజావాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకొనున్న ఆది దంపతులు, రాత్రి క్షేత్ర పురవీధుల్లో కన్నులపండువగా శ్రీ స్వామి అమ్మవారి గ్రామోత్సవం