NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు హైదరాబాద్‌కు టి.కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ థాక్రే.. సాయంత్రం 5 గంటలకు సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ సింధు ఇంటికి థాక్రే.. రేపు డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్‌ బేరర్స్‌తో సమావేశం

* ప్రకాశం జిల్లా: పొదిలి శివాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా అశ్వవాహన ఉత్సవం, త్రిషులేశ్వరవతారంలో దర్శనం ఇవ్వనున్న స్వామివారు.

* పల్నాడు: నేడు అమరావతిలో పర్యటించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు తదితరులు..

* అమరావతిలో జ్ఞాన బుద్ధ ప్రాజెక్టును పరిశీలించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అమరావతిలో అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొనున్న మంత్రి కిషన్ రెడ్డి.

* గుంటూరు: నేడు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న అఖిల భారత హిందూ మహాసభ నాయకులు జీవీశాస్త్రి, వెలగపూడి గోపాలకృష్ణ తదితరులు.. ఉద్దండరాయుని పాలెం, వెలగపూడి, మందడం దీక్ష శిబిరాలలో రైతులను కలవనున్న నేతలు…

* తిరుమల: ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ..

* కడప: రేపు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. జిల్లాలోని సున్నపురాళ్ళపల్లి వద్ద జెఎస్ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు భూమిపూజ చేయనున్న సీఎం.. మధ్యాహ్నం పులివెందులలో జరిగే ఓ పన్షన్‌కు హాజరు కానున్న సీఎం

* విశాఖ: ఆర్కే బీచ్‌లో పర్యాటక పోలీసు స్టేషన్ సేవలు.. నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం.. 10బైక్స్, 2 బీచ్ పెట్రోలింగ్ ట్రాక్టర్స్ ఏర్పాటు..

* ఏలూరు జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పర్యటన.. పెదవేగి మండలం లక్ష్మీపురంలక్ష్మీపురంలో ప్రైవేటు కార్యక్రమానికి హాజరు కానున్న వెంకయ్యనాయుడు..

* పశ్చిమగోదావరిజిల్లా: నేడు విశ్వహిందూపరిషత్ , బజరంగ్ దళ్ ఆద్వర్యంలో ఛలో పాలకొల్లు కార్యక్రమం.. హిందువులపై దుష్ప్రచార్నాన్ని చేస్తున్న మతోన్మాదులను తరిమికొట్టాలనే నినాదంతో హిందూ జాగరణయాత్ర.. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో జాగరణయాత్రకు అనుమతిలేదంటున్న పోలిసులు..

* నేడు రాజమండ్రిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు.. మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీల నిర్వహణ

* తూర్పుగోదావరి జిల్లాలో నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. మధ్యాహ్నం కేశవరం రోడ్ కొండ గుంటూరు పాకలు లో కల్వరి మందిర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. రాత్రి డా.బి.అర్.అంబేడ్కర్ జిల్లా రావులపాలెం మండలం ఇందిరా నగర్ కాలనీ లో పెంతికొస్తు క్రైస్తవ మహా సభలలో పాల్గొననున్న తానేటి వనిత

* తిరుమల: రేపు టిటిడి పాలకమండలి సమావేశం.. 3500 కోట్ల అంచనాతో వార్షిక బడ్జేట్ కి ఆమోదం తెలపనున్న పాలకమండలి, ఈ వార్షిక సంవత్సరంలో భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం, 1500 కోట్లకు చేరుకోనున్న వార్షిక శ్రీవారి హుండీ ఆదాయం

* తిరుపతి: నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూలు.. విత్తలతడుకు (నారాయణవరం మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.. వెదురు కళాకారులతో ముఖాముఖి సమావేశం.. గోవిందప్ప కండ్రిగలో స్థానికులతో మాటామంతీ.. అరణ్యం కండ్రిగలో దాసరి, పద్మశాలి సామాజికవర్గీయులతో సమావేశం..కృష్ణంరాజుల కండ్రిగలో స్థానికులతో మాటామంతీ..తుంబూరులో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం, ఐఆర్ కండ్రిగలో భోజన విరామం.. పలమనగళంలో ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి.. లపూడి (పిచ్చాటూరు మండలం)లో బహిరంగసభలో ప్రసంగం.. కీలపూడి విడిది కేంద్రంలో బస.

* శ్రీకాకుళం: నేడు మందసలో శ్రీవాసుదేవుని కళ్యాణ మహోత్సవం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి, శ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వాముల పర్య వేక్షణలో శ్రీదేవి, భూదేవి సమేత వాసుదేవునికి కళ్యాణ మహోత్సవం.

* నేడు శ్రీశైలంలో నాలుగవరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉదయం కాణిపాకం దేవస్థానం తరుపున శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ.. సాయంకాలం టీటీడీ తరుపున పట్టువస్త్రాలు సమర్పణ, మయూరవాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆదిదంపతులు, రాత్రి శ్రీస్వామి అమ్మవారికి వైభవంగా గ్రామోత్సవం