Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణ.. అదానీ గ్రూప్‌ హిండెన్‌బర్గ్ నివేదికపై ఆరోపణలపై రిటైర్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌

* వైఎస్‌ వివేకా హత్య కేసు నిందితులు కడప నుంచి హైదరాబాద్‌కు తరలింపు.. కడప జైలు నుంచి తెల్లవారుజామున 4 గంటలకు నిందితులను నాలుగు ప్రత్యేక వాహనాల్లో తరలించిన పోలీసులు.. నేడు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ సీబీఐ కోర్టులో నిందితులను హాజరపరచనున్న పోలీసులు

* నేటి నుంచి తెలంగాణలో బీజేపీ స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్స్‌.. 119 నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు సమావేశాలు

* హైదరాబాద్‌: నేడు 19 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు..

* నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా..

* నేటి నుంచి మహిళలల టీ 20 ప్రపంచకప్‌.. రాత్రి 10.30 గంటలకు దక్షిణాఫ్రికాతో శ్రీలంక తొలి మ్యాచ్‌

* నేడు ముంబైలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. రెండు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

* ఏలూరు జిల్లా: నేడు పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. ప్రాజెక్టు పనుల పరిశీలన.. అనంతరం ప్రాజెక్టు నిర్మాణపనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష.. మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం నుంచి రాజమండ్రి చేరుకోనున్న మంత్రి అంబటి..

* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కొట్టు..

* ప్రకాశం : నేడు దోర్నాలలో నూతనంగా నియమించిన గ్రామసచివాలయ కన్వీనర్లు, గృహసారదుల సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్.. దోర్నాల మండలం చిన్నగుడిపాడులో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి

* బాపట్ల : చినగంజం మండలం మోటుపల్లి శ్రీ వీరభద్ర ఆలయ ప్రాంగణంలో మనం మరచిన మోటుపల్లి చారిత్రక వ్యాసాలు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, జిల్లా కలెక్టర్ విజయా కృష్ణన్, సినీ నటులు అజయ్ గోష్..

* బాపట్ల : అద్దంకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 108 కలశాలతో జలాభిషేకం, హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు..

* బాపట్ల : చీరాల కామాక్షి సోమేశ్వర ఆలయ 76వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి కోటి కుంకుమార్చన, నగరోత్సవం..

* ఒంగోలులో మెగా టీ20 సౌత్ జోన్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కలెక్టర్ దినేష్ కుమార్..

* నెల్లూరు: నేడు నింగిలోకి SSLV-D2.. ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ దావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి SSLV-D2 రాకెట్ ప్రయోగం.. EOS-07 భూ పరిశీలనా ఉపగ్రహంతోపాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను నింగిలోనికి పంపనున్న శాస్త్రవేత్తలు.

* నంద్యాల: నేడు డోన్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా..

* తూర్పుగోదావరి జిల్లాలో నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యాటన పర్యటన.. ఉదయం 11:30 నిమిషాలకు కొవ్వూరు టౌన్,గోదావరి బాండ్ రోడ్,నియో కాన్సెప్ట్ చర్చ్ నందు జరుగు క్రిస్టియన్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారల కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. రాత్రి 9 గంటలకు రాజమండ్రి సిటీ మంజీర కన్వేషన్ నందు జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.

* అనంతపురం : నేడు కంబదూరు మండల కేంద్రంలోని జొగప్పకాలనీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* నేడు కాకినాడ జీజీహెచ్ కి రానున్న మంత్రులు సీదిరి అప్పల రాజు, దాడిశెట్టి రాజా.. జీ.రాగం పేట ఆయిల్ ఫ్యాక్టరీ ప్రమాదం లో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న మంత్రులు

* కాకినాడ: ట్రాక్ మరమ్మతుల కారణంగా కాకినాడ పోర్ట్ విశాఖపట్నం (17267), విశాఖపట్నం కాకినాడ పోర్ట్ ( 17268), కాకినాడ పోర్టు విజయవాడ ( 17258), విజయవాడ కాకినాడ పోర్టు (17257) రైళ్లను నేడు రద్దు చేసినట్లు ప్రకటించిన రైల్వే శాఖ

* పల్నాడు నేడు చిలకలూరిపేట 28వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి విడదల రజిని..

* బాపట్ల: నేడు అమృతలూరు మండలం ఇంటూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున

Exit mobile version